AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఈ బాబా స్టైలే వేరు.. కాలుతోన్న పెనం పైనుంచే భక్తులకు దీవెనలు.. వీడియో చూస్తే అవాక్కే..

సోషల్ మీడియాలో మీరు ఇప్పటికే చాలా మంది బాబాలను, వారి విన్యాసాలు చూసే ఉంటారు. అయితే, తాజాగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోన్న వీడియో చూస్తే మాత్రం కచ్చితంగా షాక్ అవుతారనడంలో ఎలాంటి సందేహం లేదు.

Viral Video: ఈ బాబా స్టైలే వేరు.. కాలుతోన్న పెనం పైనుంచే భక్తులకు దీవెనలు.. వీడియో చూస్తే అవాక్కే..
Baba Viral Video
Venkata Chari
|

Updated on: Mar 26, 2023 | 5:42 AM

Share

సోషల్ మీడియాలో మీరు ఇప్పటికే చాలా మంది బాబాలను, వారి విన్యాసాలు చూసే ఉంటారు. అయితే, తాజాగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోన్న వీడియో చూస్తే మాత్రం కచ్చితంగా షాక్ అవుతారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ వీడియో చూసిన తర్వాత మీ కళ్ళను మీరే నమ్మలేనంతగా షాకిస్తుంది. వైరల్ అవుతున్న వీడియోలో ఒక బాబా మండుతున్న పొయ్యిపై కూర్చుని, భక్తులకు దీవెనలు ఇస్తున్నట్లు చూడొచ్చు.

అవును మీరు విన్నది నిజమే.. మండుతున్న పొయ్యి మీద కూర్చోవడమే కాకుండా తన భక్తులకు దీవెనలు ఇస్తున్నాడు. అయితే, ఈ బాబాకు ఏం కాకపోవడం మాత్రం ఆశ్యర్యకరంగా ఉంది. పక్కనున్న వారు పొయ్యి కింద కట్టెలు పెట్టి మరింత మంట పెట్టడం కూడా ఈ వీడియోలో చూడొచ్చు. బాబా మాత్ర ఎలాంటి చలనం లేకుండా, భక్తులతో మాట్లాడుతూ, దీవెనెలు ఇస్తూ ఆశ్యర్యపరుస్తున్నాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరలవుతోంది. దీనిపై నెటిజన్లు మాత్రం రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

కాగా, మహారాష్ట్రలోని అమరావతి జిల్లా తివాసా తాలూకా మర్ది ఏరియాలో సంత్ గురుదాస్ మహారాజ్ ఉన్నాడు. ఈ బాబా చెంతకు ఎంతో మంది భక్తులు వస్తుంటారు. ఈ బాబాకు స్థానికంగా ఓ ఆశ్రమం కూడా ఉంది. ఈ బాబా వీడియో వైరల్ కావడంతో.. ఇలాంటి మూఢనమ్మకాలను నమ్మొద్దంటూ మూఢనమ్మకాల నిర్మూలన కమిటీ సభ్యులు ప్రజలకు సూచించారు. ఇదే నిజమైతే బాబాకు రూ.30లక్షల రివార్డు అందిస్తామంటూ సవాల్ విసిరారు. అయితే, దీనిపై స్పందించిన గురుదాస్ మహారాజ్.. తాను మూఢనమ్మకాల కోసం పని చేయడం లేదని, కేవలం గోసంరక్షణే లక్ష్యంగా పని చేస్తున్నట్లు తెలిపాడు. అలాగే, తనలో దైవ శక్తి ఉందంటూ ప్రకటించాడు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..