కరోనా సమయంలో మనుషులు బంధాలు ఎలా మాయమయిపోయాయో, మాసిపోయాయో తెలియజేసే అనేక ఘటనలు మనం చూశాం. కడుపున పుట్టినవారు సైతం కన్నవారి అంత్యక్రియలు చేసేందుకు ముందుకురాని దౌర్భాగ్యకర ఘటనల గురించి చదివాం. కానీ జంతువుల్లో, పక్షుల్లో ప్రేమ, స్వచ్చత మాత్రం అలానే ఉన్నాయి. పెట్స్ ను పెంచుకునేవారికి ఈ విషయం స్పష్టంగా తెలుస్తుంది. యజమానుల కోసం ప్రాణాలు అర్పించిన శునకాల ఘటనలు అయితే మనకు నిత్యం తారసపడుతూనే ఉంటాయి. మనుషులపైనే అలాంటి ప్రేమ చూపించే యానిమల్స్, బర్డ్స్ ఇంక వాటి భాగస్వాములపై, పిల్లలపై ఎంత ప్రేమ కనబరుస్తాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తాజాగా మీ ముందుకు ఒక హృదయవిదారకర వీడియోను తీసుకొచ్చాం. ఆస్ట్రేలియన్ గాలా పక్షి (పింక్, గ్రే కాకాటూ అనే పేర్లతో కూడా పిలుస్తారు) తన భాగస్వామి చనిపోవడంతో గుండెలవిసేలా రోధించింది. అక్కడ్నుంచి వెళ్లలేక అది పడిన ఆవేదన మిమ్మల్ని కూడా కన్నీళ్లు పెట్టిస్తుంది.
చూశారుగా చనిపోయిన తన భాగస్వామి చుట్టూ తిరుగుతూ అది ఎంత ఆవేదన చెందుతుందో. వెళ్లలేక, వెళ్లలేక చివరికి చనిపోయిన పక్షికి తన తల ఆనిచ్చి ఫైనల్ గుడ్ బై చెప్పి అక్కడి నుంచి అది నిష్క్రమించింది. వీడియోలో 45 సెకన్ల వద్ద మీరు ఆ దృశ్యాన్ని చూడవచ్చు. మరికొన్ని పక్షులు అక్కడే ఉండటం కూడా మీరు గమనించవచ్చు. ఈ వీడియో ప్రస్తుతం నెటిజన్ల హృదయాలను కదిలిస్తుంది.
Also Read: అమ్మ అపస్మారక స్థితిలో.. తమ్ముడు గుక్కెట్టి ఏడుస్తున్నాడు.. ఆ చిట్టి తల్లి ఏం చసిందంటే