వారెవ్వా..! బోజ్‌పురి సాంగ్‌కు దుమ్మురేపిన ఆంటీ.. వీడియో చూస్తే అవాక్కావ్వాల్సిందే..!
ఒక ఆంటీ చేసిన అద్భుతమైన డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది ఇంటర్నెట్‌లో సంచలనం సృష్టించింది. ఈ వయసులో కూడా ఆ మహిళ ప్రదర్శించిన ఆత్మవిశ్వాసం ప్రశంసనీయం. ఆమె డ్యాన్స్ సమయంలో చాలా శక్తితో ప్రదర్శించింది. ఆ వీడియోను చూసిన తర్వాత ప్రతి ఒక్కరూ షాక్‌కు గురవుతున్నారు. ప్రతిభ వయస్సుపై ఆధారపడి ఉండదని ఆంటీ తన డాన్స్‌తో నిరూపించిందని చాలా మంది యూజర్లు అన్నారు.

ఈ రోజుల్లో, డ్యాన్స్ వీడియోల మాయాజాలం సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపిస్తోంది. అది పెళ్లి అయినా, కుటుంబ కార్యక్రమం అయినా, జనం తమ డాన్స్‌తో అదరగొడుతున్నారు. అందర్నీ ఉత్తేజపరచడమే కాకుండా ఇంటర్నెట్‌లో కూడా దుమ్మురేపుతున్నారు. తాజాగా అలాంటి ఒక డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ఒక ఆంటీ భోజ్‌పురి పాటకు డాన్స్ చేస్తూ కనిపించింది. ఆ మహిళ చేసిన డాన్స్ చూసిన తర్వాత, ప్రేక్షకులు ఆమెకు అభిమానులుగా మారారు. ఈ మహిళ పేరు సంగీత మిశ్రా, ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో తనను తాను డాన్సర్‌గా అభివర్ణించుకుంది. ఆమెకు 10 సంవత్సరాల కంటే ఎక్కువ అనుభవం ఉంటున్నట్లు పేర్కొంది.
వీడియోలో, టీవీలో భోజ్‌పురి పాట ప్లే అవుతుండగా, దానికి అనుగుణంగా ఆ మహిళ గదిలో డాన్స్ చేస్తూ కనిపించింది. భోజ్‌పురి పాట ప్లే కావడం ప్రారంభించిన వెంటనే, ఆమె పూర్తి నమ్మకంతో బీట్‌కు డాన్స్ చేయడం ప్రారంభించింది. ఆమె హావభావాలు, కదలికలతో డాన్స్ ఇరగదీసింది. ప్రేక్షకులు చూస్తూనే ఉండిపోయారు. ఆంటీ చేసిన డాన్స్ ఒక ప్రొఫెషనల్ నృత్యకారిణి కంటే తక్కువ కాదు. ఆమె ప్రతి కదలిక పూర్తిగా సాటిలేనిది. ఈ వయస్సులో కూడా, ఆ మహిళ చాలా శక్తివంతంగా డాన్స్ చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ మహిళ ఈ డాన్స్ వీడియో చూసిన తర్వాత ఆమె ఫిదా అయిపోయారు.
ఈ అద్భుతమైన డ్యాన్స్ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో sangeeta_mishra05 అనే IDతో షేర్ చేయడం జరిగింది. దీనిని 14 మిలియన్లకు పైగా అంటే 1.4 కోట్ల మంది వీక్షించారు. 5 లక్షలకు పైగా ప్రజలు ఈ వీడియోను లైక్ చేసి వివిధ ప్రతి స్పందనలు తెలియజేశారు.
వీడియోను ఇక్కడ చూడండి..
View this post on Instagram
వీడియో చూసిన తర్వాత, ఒక యూజర్ ‘ఆంటీ ఆత్మవిశ్వాసం, డాన్స్ రెండూ అద్భుతంగా ఉన్నాయి’ అని రాశాడు, మరొకరు ‘ఇప్పుడు ఆమెను తదుపరి డ్యాన్స్ రియాలిటీ షోకి పంపండి’ అని రాశారు. అదే సమయంలో, ప్రతిభ వయస్సుపై ఆధారపడి ఉండదని ఆంటీ తన డాన్స్‌తో నిరూపించిందని చాలా మంది యూజర్లు అన్నారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
