Viral Video: షాకింగ్.. చూస్తుండగానే రైలు కింద పడిపోయింది.. ఒళ్లుగగుర్పొడిచే వీడియో..

ఇటీవల కాలంలో చూస్తుండగానే ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. రెప్పపాటులో జరిగే ప్రమాదాలు ఎన్నో కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని

Viral Video: షాకింగ్.. చూస్తుండగానే రైలు కింద పడిపోయింది.. ఒళ్లుగగుర్పొడిచే వీడియో..
Viral Video
Follow us
Rajitha Chanti

|

Updated on: Apr 20, 2022 | 6:55 PM

ఇటీవల కాలంలో చూస్తుండగానే ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. రెప్పపాటులో జరిగే ప్రమాదాలు ఎన్నో కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపుతున్నాయి. వయసుతో సంబంధం లేకుండా.. పిల్లలు , పెద్దలు పెను ప్రమాదాల బారీన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. మరికొందరు తృటిలో ప్రాణాలతో భయటపడుతున్నారు. అయితే కొన్ని ప్రమాదాలు మాత్రం ఎప్పటికీ అంతుచిక్కని మిస్టరీలుగా ఉండిపోతాయి. అసలేం జరిగిందో కూడా తెలియదు.. చూస్తుండగానే మృత్యువు ఒడిలోకి వెళ్లిపోతారు. ఇటీవల ఓ కానిస్టేబుల్ తిరుగుతూ తిరుగుతూ గూడ్స్ రైలు కింద పడి మృతి చెందిన సంగతి తెలిసిందే. అప్పటివరకు ఎంతో ఆరోగ్యంగా ఉండి.. విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ ఉన్నట్టుండి రైలు కింద పడి మరణించాడు. ఇలాంటి తరహా ఘటనే అర్జెంటీనాలోనూ జరిగింది. అందరూ చూస్తుండగానే ఓ యువతి రైలు కింద పడిపోయింది. క్షణాల్లో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఆ యువతిని కాపాడడంతో ప్రాణాలతో బయటపడింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్‏లోని ఇండిపెటండెన్స్ స్టేషన్‏లో ఓ యువతి రైలు కోసం ఎదురుచూస్తోంది. ఆకస్మాత్తుగా ఆమెకు కళ్లు తిరగడంతో తూలుతూ బ్యాలెన్స్ తప్పిపోయి కదులుతున్న రైలు కింద పడిపోయింది. దీంతో అక్కడే ఉన్న ప్రయాణికులు షాకయ్యారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది రైలును ఆపి.. ఆ యువతిని క్షేమంగా బయటకు తీశారు. ఆమెకు స్వల్ప గాయాలు కావడంతో వీల్ చైర్‏లో చికిత్సకు తరలించారు. ప్రస్తుతం ఆమెకు ప్రాణపాయం తప్పింది. యువతి స్పృహ తప్పి పడిపోయిన విజువల్స్ అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఆ షాకింగ్ వీడియోను మీరు ఓసారి చూసేయ్యండి.

Also Read: Ashokavanamlo Arjuna Kalyanam: ముప్పై ఏళ్ళు దాటిన అర్జునుడి పెళ్లి కష్టాలు.. ఆకట్టుకుంటున్న

అశోకవనంలో అర్జున కళ్యాణం ట్రైలర్..

KGF Chapter 2: ఇదెక్కడి మాస్ మావ.. అంత పవర్‌ఫుల్ డైలాగ్‌ను ఇలా వాడేశారేంట్రా..!

Gangubai Kathiawadi: ఓటీటీలో సందడి చేయనున్న గంగూబాయి.. స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్ చేసిన మేకర్స్..