Viral Video: ఉద్యోగం నుంచి తీసేసాడని బాస్‏కు దిమ్మతిరిగే షాకిచ్చాడు.. ఏకంగా బుల్డోజర్‏నే రంగంలోకి దింపి..

|

Aug 02, 2022 | 12:02 PM

కానీ ఓ ఉద్యోగి మాత్రం ఏకంగా బుల్డోజర్‏తో బాస్ ఇంటిపై దాడి చేశాడు. కంపెనీకి చెందిన విలాసవంతమైన బంగ్లాపై బుల్డోజర్‏ను ఎక్కించాడు.

Viral Video: ఉద్యోగం నుంచి తీసేసాడని బాస్‏కు దిమ్మతిరిగే షాకిచ్చాడు.. ఏకంగా బుల్డోజర్‏నే రంగంలోకి దింపి..
Viral
Follow us on

సాధారణంగా ఆఫీసులలో బాస్ పెట్టే రూల్స్..టార్చర్‏ను ఎంతో సహనంగా భరిస్తుంటారు ఉద్యోగులు. బాస్ పై కోపం వచ్చినప్పటికీ శాంతంగా ఉంటూ నెట్టుకొస్తారు. షరతులను భరిస్తారు.. కానీ అనుహ్యంగా ఉద్యోగం నుంచి తొలగిస్తే ఏం చేస్తారు. కొందరు మరో జాబ్ చూసుకుంటారు. లేదంటే బాస్ పై కోపం ప్రదర్శిస్తారు. కానీ ఓ ఉద్యోగి మాత్రం ఏకంగా బుల్డోజర్‏తో బాస్ ఇంటిపై దాడి చేశాడు. కంపెనీకి చెందిన విలాసవంతమైన బంగ్లాపై బుల్డోజర్‏ను ఎక్కించాడు. దీంతో కంపెనీకి తీవ్ర నష్టం వాటిల్లింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

కేనడాలోని కాల్గరీలో జూలై 21న ఈ వింత ఘటన జరిగింది. పోలీసులు ఘటన స్థలానికి చేరుకోకముందే స్థానికంగా ఉన్న ఓ వ్యక్తి ఈ తతంగాన్ని కెమెరాలో రికార్డ్ చేశారు. స్థానిక వ్యక్తి తెలిపిన వివరాల ప్రకారం. 59 ఏళ్ల ఓ వ్యక్తిని అతని బాస్ ఉద్యోగం నుంచి తొలగించాడు. దీంతో కోపోద్రిక్తుడైన ఆ ఉద్యోగి బుల్డోజర్ తీసుకువచ్చి.. కంపెనీకి చెందిన విలాసవంతమైన బంగ్లాపై దాడి చేశాడు. బంగ్లా ద్వంసం కావడంతో కంపెనీకి తీవ్ర నష్టం వాటిల్లింది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. జూలై 28న సోషల్ మీడియాలో షేర్ చేసిన ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది.

ఇవి కూడా చదవండి

ట్వీట్..

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.