Viral Video: కోపంతో కారుపై దాడి చేసిన ఏనుగులు.. షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్

|

Jun 29, 2022 | 10:09 AM

కొన్ని వాహనాలు రోడ్డుపై పార్క్ చేసి ఉన్నాయి. ఆ సమయంలో ఏనుగుల గుంపు అడవి నుండి బయటకు వచ్చి రోడ్డుపై చాలా వాహనాలను చూసి వాటి పైకి లేచి ముందు ఉన్న వాటిపై దాడి చేసి.. విధ్వంసం చేయడం ప్రారంభించాయి

Viral Video: కోపంతో కారుపై దాడి చేసిన ఏనుగులు.. షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్
Elephant Video Viral
Follow us on

Viral Video: అన్ని రకాల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి . కొన్ని వీడియోలు కొంచెం భావోద్వేగాన్ని కలిగిస్తాయి. కొన్ని చాలా ఫన్నీగా ఉంటాయి. అదే సమయంలో కొన్ని వీడియోలను చూసి జనం  ఆశ్చర్యపోతుంటారు కూడా. తాజాగా ఏనుగులకు సంబంధించిన ఓ వీడియో .. సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ  వీడియో చూసివారికి గూస్‌బంప్స్  వస్తున్నాయి. ఈ వీడియోలో కొన్ని ఏనుగులు చాలా కోపంగా కనిపించాయి. అంతేకాదు రోడ్డు మధ్యలో కారు డ్రైవర్‌పై దాడి చేశాయి.  ఏనుగులు అడవిలో సరదాగా గడిపే అనేక వీడియోలను చూస్తూనే ఉన్నాం.. అయితే ఇలాంటి ప్రమాదకరమైన వీడియోలు చాలా అరుదుగా కనిపిస్తాయి. ఏనుగులు అడవి జంతువులు అయినప్పటికీ సాంఘిక జంతువులు అవి మనుషులతో కలిసి హాయిగా జీవించగలవు. వాస్తవానికి ఏనుగులు అడవి జంతువులు మాత్రమే, అడవులలో నివసించడానికి ఇష్టపడే ఏనుగుల జీవన విధానానికి ఎవరైనా ఆటంకపరిస్తే.. అప్పుడు వాటి కోపాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది.

ఏనుగుల గుంపు కోపంతో ఎంతటి బీభత్సాన్ని సృష్టిస్తుందో వీడియోలో మీరు చూడవచ్చు. కొన్ని వాహనాలు రోడ్డుపై పార్క్ చేసి ఉన్నాయి. ఆ సమయంలో ఏనుగుల గుంపు అడవి నుండి బయటకు వచ్చి రోడ్డుపై చాలా వాహనాలను చూసి వాటి పైకి లేచి ముందు ఉన్న వాటిపై దాడి చేసి.. విధ్వంసం చేయడం ప్రారంభించాయి. ఈ సమయంలో, ఒక వ్యక్తి కూడా కారులో నుండి బయటకు పరుగెత్తుతున్నట్లు కనిపిస్తుండగా, డ్రైవర్‌తో సహా కొంతమంది కారు లోపల కూర్చున్నారు. అయితే ఏనుగులు పెద్దగా అలజడి సృష్టించకపోవటం అదృష్టమేనని చెప్పవచ్చు. కారు డ్రైవర్ పారిపోయే అవకాశం కలిగింది. నిజానికి ఈ వీడియోలో ఏనుగులు కోపం తీరుని చూస్తే.. అవి సృష్టించిన బీభత్సం తక్కువే నని చెప్పవచ్చు. ఎందుకంటే ఏనుగులకు కోపాన్ని మనిషి భరించలేడు..

ఇవి కూడా చదవండి

ఈ వీడియో కర్ణాటకలోని హసనూర్ లోనిది అని తెలుస్తోంది. ఈ వీడియోను ఐఏఎస్ అధికారిణి సుప్రియా సాహు తన ట్విట్టర్ హ్యాండిల్‌లో షేర్ చేశారు. కేవలం 30 సెకన్ల ఈ వీడియోను ఇప్పటి వరకు 22 వేలకు పైగా వీక్షించగా, వందలాది మంది ఈ వీడియోను లైక్ చేసి రకరకాల రియాక్షన్స్ కూడా ఇచ్చారు. ఈ వీడియో చూసి కొంతమందికి చాలా కోపం వచ్చింది.

మరిన్ని ట్రెండింగ్ వీడియోల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..