అన్ని రకాల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. మనుషుల నుండి జంతువులు,పక్షులు, చిన్న కీటకాల వరకు అనేక రకాల వీడియోలు వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో చూస్తుంటాం.. Facebook, Instagram, Twitter వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వీడియోలను చూస్తాము. కొన్ని వీడియోలు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి, కొన్ని చాలా ఫన్నీగా ఉంటాయి. వీటిని చూసి ప్రజలు తెగ ఎంజాయ్ చేస్తుంటారు. అలాంటి ఒక ఫన్నీ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ వీడియో కుక్కలు, గాడిదలకు సంబంధించినది. అనవసరంగా ఎవరినీ వేధించవద్దని, లేదంటే ఒక్కోసారి దాని ఫలితం చాలా దారుణంగా ఉంటుందని ఈ వీడియో చూస్తే అర్థం అవుతుంది. అదే ఈ వీడియోలో కూడా చూడవచ్చు. వాస్తవానికి, రెండు కుక్కలు ఎటువంటి కారణం లేకుండా గాడిదను ఇబ్బంది పెట్టాయి. ఆ తర్వాత అవి గాడిద కోపానికి గురై తృటిలో ప్రాణాలతో బయటపడ్డాయి.
వైరల్ అవుతున్న ఈ వీడియోలో..రోడ్డుపై ఓ గాడిద నిలబడి ఉంది.. అటుగా వచ్చిన రెండు కుక్కలు మొరుగుతూ..గాడితను ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి. పదేపదే అరుస్తూ అవి వెంటపడ్డాయి. వాటి వేధింపులకు గాడిద విసిగిపోయింది. కోపంతో చిర్రెత్తిపోయి దాని కొమ్ములతో కుక్కను కుమ్మేసింది. నోటితో కరిచిపట్టుకుని ఈడ్చుకెళ్లింది. దాంతో మరో కుక్క బతుకు జీవుడా అని భయంతో అక్కడి నుంచి పారిపోయింది. గాడిద మొదట కుక్కను పరిగెత్తించింది. రెండు కాళ్లను పట్టి గాల్లోకి లేపి ఎత్తేసింది. ఆ తర్వాత కిందపడేసి తన్నుతూ ముందుకు దొర్లించింది. కిందపడ్డ వెంటనే పైకి లేచిన ఆ కుక్క సైతం మెరుపు వేగంతో అక్కడి నుంచి పారిపోయింది. ఈ వీడియో చూసి జనాలు తెగ నవ్వుకుంటున్నారు.
इसलिए अनावश्यक किसी की ‘शांति भंग’ न करें..!
? pic.twitter.com/9BeHYHRrtL— Sanjay Kumar, Dy. Collector (@dc_sanjay_jas) July 2, 2022
ఈ ఫన్నీ వీడియోను జార్ఖండ్ డిప్యూటీ కలెక్టర్ సంజయ్ కుమార్ తన ట్విట్టర్ హ్యాండిల్‌లో పంచుకున్నారు. ‘కాబట్టి అనవసరంగా ఎవరి ‘శాంతికి భంగం కలిగించవద్దు’ అని క్యాప్షన్‌లో రాశారు. 11 సెకన్ల నిడివి గల ఈ వీడియోను ఇప్పటి వరకు 38 వేలకు పైగా వీక్షించగా, వందలాది మంది ఈ వీడియోను లైక్ చేసి రకరకాల ఫన్నీ కామెంట్స్ కూడా చేశారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి