Radhika-Anant Ambani: గుజరాతీ హిందూ సంప్రదాయంలో ఘనంగా జరిగిన అనంత్, రాధిక నిశ్చితార్ధం.. ప్రత్యేక ఆకర్షణగా నీతా నృత్య ప్రదర్శన
అనంత్ సోదరి ఇషా నేతృత్వంలో అంబానీ కుటుంబ సభ్యులు.. కాబోయే పెళ్లి కూతురు రాధికను ఆహ్వానించడానికి మర్చంట్ నివాసానికి వెళ్లడంతో వేడుకలు ప్రారంభమయ్యాయి. అంబానీ కుటుంబ సభ్యులు హారతి, మంత్రోచ్ఛారణల మధ్య రాధికా కుటుంబ సభ్యులకు ఘనంగా స్వాగతం పలికారు.

అంబానీ నివాసంలో రాధిక మర్చంట్, అనంత్ అంబానీల నిశితార్థం వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. అంబానీ నివాసంలో కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్య పురాతన హిందూ సంప్రదాయాన్ని అనుసరించి ఈరోజు రాధిక, అనంత్ ల ఎంగేజ్ మెంట్ జరిగింది. పూర్వపు గుజరాతీ హిందూ సంప్రదాయాన్ని అనుసరిస్తూ.. గోల్ ధన , చునారి విధి వంటి వేడుకలతో నిశ్చితార్ధం జరిపించారు కుటుంబ సభ్యలు. ఈ వేడుకల్లో భాగంగా కుటుంబ సభ్యులు బహుమతులను ఇచ్చి పుచ్చుకున్నారు. కాబోయే వధూవరులకు శుభాకాంక్షలు చెప్పారు. అనంత్ తల్లి నీతా అంబానీ నేతృత్వంలో అంబానీ కుటుంబ సభ్యులు నృత్య ప్రదర్శన చేశారు. ఈ వేడుక సరదాగా ఉత్సాహంగా నిర్వహించారు.
గోల్ ధన.. అంటే బెల్లం, ధనియాలు అని అర్ధం.. నిశ్చితార్థానికి సమానమైన గుజరాతీ సంప్రదాయాలలో వివాహానికి ముందు జరిగే వేడుక. వధువు కుటుంబ సభ్యులు బహుమతులు, స్వీట్లతో వరుడి నివాసానికి వస్తారు. అనంతరం కాబోయే వధూవరుల జంట ఉంగరాలు మార్చుకుంటారు. ఉంగరాలు మార్చుకున్న తర్వాత దంపతులు తమ పెద్దల నుండి ఆశీర్వాదం తీసుకుంటారు.
సాయంత్రం వేడుకల నిమిత్తం.. అనంత్ సోదరి ఇషా నేతృత్వంలో అంబానీ కుటుంబ సభ్యులు.. కాబోయే పెళ్లి కూతురు రాధికను ఆహ్వానించడానికి మర్చంట్ నివాసానికి వెళ్లడంతో వేడుకలు ప్రారంభమయ్యాయి. అంబానీ కుటుంబ సభ్యులు హారతి, మంత్రోచ్ఛారణల మధ్య రాధికా కుటుంబ సభ్యులకు ఘనంగా స్వాగతం పలికారు.




అనంత్ , రాధికలను తీసుకుని కుటుంబసభ్యులు శ్రీకృష్ణుని ఆలయానికి తీసుకుని వెళ్లి ఆశీస్సులను తీసుకున్నారు. ముందుగా గణేష్ల పూజ ను నిర్వహించి .. లగ్న పత్రిక రాసుకున్నారు. వివాహానికి ఆహ్వానం పఠనం తర్వాత నిశ్చితార్ధ వేడుక వేదికకు తరలివెళ్లింది.
సోదరి ఇషా ఉంగరాలు మార్చుకోనున్నారని ప్రకటించిన అనంతరం.. ఈ అనంత్, రాధిక లు తమ కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో ఉంగరాలు మార్చుకున్నారు.. పెద్దల ఆశీర్వాదాలను తీసుకున్నారు. అనంత్ , రాధిక ల మధ్య గత కొన్ని సంవత్సరాలుగా పరిచయం ఉంది.
ముఖేష్ అంబానీ నీతాల కుమారుడు అనంత్. USAలోని బ్రౌన్ యూనివర్శిటీ నుండి తన చదువును పూర్తి చేసాడు. రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో జియో ప్లాట్‌ఫారమ్‌లు, రిలయన్స్ రిటైల్ వెంచర్స్ బోర్డ్‌లలో సభ్యునిగా కూడా వివిధ హోదాలలో పనిచేశాడు. అతను ప్రస్తుతం RIL ఇంధన వ్యాపారాన్నీ నిర్వహిస్తున్నాడు. శైలా .. వీరేన్ మర్చంట్ కుమార్తె అయిన రాధిక, న్యూయార్క్ విశ్వవిద్యాలయంలో గ్రాడ్యుయేట్ పట్టా పుచ్చుకుంది. ఎన్‌కోర్ హెల్త్‌కేర్ బోర్డ్‌లో డైరెక్టర్‌గా పనిచేస్తోంది.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..