Viral: ‘జీవితంలో పోరాటం తప్పదు’.. ఆలోజింపజేస్తున్న ఆనంద్ మహీంద్ర పోస్ట్..
సాధారణంగా సోమవారం వచ్చిందంటే చాలు మనలో ఏదో తెలియని నిరుత్సాహం సహజంగానే ఆవహిస్తుంది. మళ్లీ వారం రోజులు పనిచేయాలా అన్న ఆలోచన వేధిస్తుంటుంది. ఇక ప్రతీ మనిషికి ఎన్నో బాధ్యతలు ఉంటాయి. ఇల్లు లేని వారు ఇంటి రెంటు, ఇల్లు ఉన్నవారు ఈఎమ్‌ఐ, ఖర్చులు ఇలా ఎన్నో పనులు వేధిస్తుంటాయి. అయితే వీటన్నింటినీ...

ఆనంద్ మహీంద్ర సోషల్ మీడియా మీద అవగాహన ఉన్న వారికి ఈ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ, సమాజంలో జరిగే అంశాల గురించి తనదైన శైలిలో స్పందిస్తుంటారు. ఈ క్రమంలోనే తాజాగా ఆనంద్ మహీంద్ర పోస్ట్ చేసిన ఓ ట్వీట్ నెటిజన్లను ఆలోజింప చేస్తోంది.
సాధారణంగా సోమవారం వచ్చిందంటే చాలు మనలో ఏదో తెలియని నిరుత్సాహం సహజంగానే ఆవహిస్తుంది. మళ్లీ వారం రోజులు పనిచేయాలా అన్న ఆలోచన వేధిస్తుంటుంది. ఇక ప్రతీ మనిషికి ఎన్నో బాధ్యతలు ఉంటాయి. ఇల్లు లేని వారు ఇంటి రెంటు, ఇల్లు ఉన్నవారు ఈఎమ్‌ఐ, ఖర్చులు ఇలా ఎన్నో పనులు వేధిస్తుంటాయి. అయితే వీటన్నింటినీ తట్టుకొని ముందుకు సాగడమే జీవితం.
ఆనంద్ మహీంద్ర ట్వీట్..
One of the many motivational sayings that show up in my inbox.
This one truly resonated.
Start every day with a song in your heart…
Especially when you start the week#MondayMotivaton pic.twitter.com/ErrzdJlkbI
— anand mahindra (@anandmahindra) April 1, 2024
ఇలా జీవితం నిరుత్సాహంతో నిండిపోకుండా మనల్ని ఎప్పటికప్పుడు ఉత్సాహపరచడానికి మోటివేషనల్ కొటేషన్స్ ఉంటాయి. సోషల్ మీడియాలో ఇలాంటి వాటికి కొదవే ఉండదు. తాజాగా ఇలాంటి ఓ అద్భుతమైన కొటేషన్‌ను ఆనంద్ మహీంద్ర షేర్ చేశారు. ఇంతకీ ఏ పోస్ట్‌లో ఏముందనగే.. ‘ప్రతీ ఒక్కరికీ జీవితంలో పోరాటం తప్పదు. ఎన్నో ఎత్తు పల్లాలు చూడాల్సి వస్తుంది. అయితే ఈ కష్టాలను సంతోషంగా తీసుకొని పోరాటం సాగించాలా.?లేదా బాధతో బతకీడ్చాలా.? అనేది మనమే నిర్ణయించుకోవాలి’ అన్ని అర్థం వచ్చేలా ఉన్న కొటేషన్‌ను షేర్ చేశారు.
ఈ కొటేషన్‌ను పోస్ట్ చేసిన ఆనంద్ మహీంద్ర.. ‘ప్రతీ రోజూ నా ఇన్‌బాక్స్‌లో ఎన్నో మోటివేషనల్ కొటేషన్స్‌ను చూస్తాను. వాటిలో ఇది నాకు ఎంతగానో నచ్చింది. ప్రతీ రోజూ మీకు నచ్చిన ఒక పాటతో జీవితాన్ని ప్రారంభించండి. ముఖ్యంగా సోమవారం’ అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..