కాళ్లతో ఆర్చరీలో గోల్డ్ మెడల్ సాధించిన శీతల్.. నువ్వు నాకు గురువు.. నచ్చిన కారు ఎంచుకోమన్న ఆనంద్ మహీంద్రా

|

Oct 29, 2023 | 5:29 PM

తనకు చేతులు ఇవ్వకపోయినా దేవుడు కాళ్లు ఇచ్చాడు అంటూ ధైర్యాన్ని కోల్పోకుండా అర్చరీని నేర్చుకుంది. ఇప్పుడు ఆమె  విలువిద్యను అందరూ కొనియాడుతున్నారు. ఆనంద్ మహీంద్రా కూడా శీతల్‌పై ప్రశంసల వర్షం కురిపించకుండా.. ప్రోత్సహించకుండా ఆపుకోలేకపోయారు. శీతల్‌కి సంబంధించిన అందమైన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మహీంద్రా గ్రూప్ చైర్మన్ కూడా శీతల్ దేవి అవసరాలకు అనుగుణంగా కారును మోడిఫై చేయనున్నట్లు తెలిపారు.

కాళ్లతో ఆర్చరీలో గోల్డ్ మెడల్ సాధించిన శీతల్.. నువ్వు నాకు గురువు.. నచ్చిన కారు ఎంచుకోమన్న ఆనంద్ మహీంద్రా
Sheetal Devi
Follow us on

కొంతమంది తమకు ఎన్ని అవకాశాలున్నా.. ఏదో అసంతృప్తితో జీవిస్తూ ఉంటారు. అదే సమయంలో మరికొందరు. తమకు దేవుడు అవయవ లోపాన్ని ఇచ్చినా కృషి పట్టుదలతో తమదైన ప్రతిభను చాటుతూ..  చరిత్రలో తమకంటూ ఓ పేజీ లిఖించుకుంటారు. తాజాగా ఆసియా పారా గేమ్స్‌కి సంబంధించిన ఓ యువతి కి చెందిన వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఆ యువతి భారతీయురాలు. కాశ్మీర్ లో ఒక చిన్న గ్రామానికి చెందిన ఈ అర్చర్ శీతల్ దేవి. ఆసియా పారా గేమ్స్ లో 2 గోల్డ్, 1 సిల్వర్ సాధించి చరిత్ర సృష్టించింది శీతల్ దేవి. ఈ యువతి ప్రతిభకు నెటిజన్లతో పాటు భారతీయ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ను కూడా ఆకట్టుకుంది.

ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు.  మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ X లో తనకు నచ్చిన మనసు మెచ్చిన పోస్టులను షేర్ చేస్తూ ఉంటారు. ఈ 68 ఏళ్ల వ్యాపారవేత్త వివిధ రంగాలకు చెందిన వ్యక్తుల స్ఫూర్తిదాయకమైన కథనాలను నెటిజన్లకు అందిస్తూనే ఉన్నారు. తాజాగా ఆనంద్ మహీంద్రా ఓ అమ్మాయికి కారు ఆఫర్ చేయడంతో సోషల్ మీడియా యూజర్లు షాక్ అయ్యారు. ఏదైనా మహీంద్రా కారును లైక్ చేయమని తన X ప్లాట్ ఫామ్ వేదికగా భారత పారా అథ్లెట్ శీతల్ దేవిని మహీంద్రా గ్రూప్ చైర్మన్ కోరారు.

ఇవి కూడా చదవండి

చైనాలోని హాంగ్‌జౌలో జరుగుతున్న నాలుగో ఆసియా పారా గేమ్స్‌లో ఆర్చరీలో శీతల్ స్వర్ణం సాధించింది. శీతల్‌కు చేతులు లేవు. తన పాదాలనే చేతులుగా మార్చి విలువిద్యను అభ్యసించింది. తనకు చేతులు ఇవ్వకపోయినా దేవుడు కాళ్లు ఇచ్చాడు అంటూ ధైర్యాన్ని కోల్పోకుండా అర్చరీని నేర్చుకుంది. ఇప్పుడు ఆమె  విలువిద్యను అందరూ కొనియాడుతున్నారు. ఆనంద్ మహీంద్రా కూడా శీతల్‌పై ప్రశంసల వర్షం కురిపించకుండా.. ప్రోత్సహించకుండా ఆపుకోలేకపోయారు. శీతల్‌కి సంబంధించిన అందమైన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

 

కొత్త కారును ఆఫర్ చేసిన ఆనంద్ మహీంద్రా

శీతల్ దృఢ సంకల్పం..  కృషి ఈ వీడియోలో చూడొచ్చు. శీతల్ ను చూసిన తర్వాత ఆనంద్ మహీంద్రా జీవితంలో తాను ఇక చిన్న చిన్న సమస్యలకు ఫిర్యాదు చేయనని శపథం చేశాడు. శీతల్‌ను టీచర్‌గా అభివర్ణించారు. శీతల్‌ను ప్రోత్సహించేందుకు మహీంద్రా ఆమెకు కొత్త కారును గిఫ్ట్ గా ఇవ్వనున్నామని ప్రకటించారు. శీతల్ తనకు నచ్చిన ఏదైనా మహీంద్రా కారును ఎంచుకోవచ్చని ఆయన వెల్లడించారు.

స్వర్ణం సాధించిన తొలి భారత పారా అథ్లెట్

మహీంద్రా గ్రూప్ చైర్మన్ కూడా శీతల్ దేవి అవసరాలకు అనుగుణంగా కారును మోడిఫై చేయనున్నట్లు తెలిపారు. ఆనంద్ మహీంద్రా తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఇంటర్నెట్‌లో చాలా మంది వినియోగదారులు ప్రశంసించారు. అక్టోబర్ 27న శీతల్ దేవి ఆసియా పారా గేమ్స్ సింగిల్ ఎడిషన్‌లో రెండు బంగారు పతకాలు సాధించి.. తొలి భారతీయురాలుగా చరిత్ర సృష్టించింది.

చేతులు లేకుండా ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకున్న శీతల్

శీతల్ ఫోకోమెలియా సిండ్రోమ్‌తో జన్మించింది. ఈ వ్యాధి ఉన్నవారిలో శరీర భాగాలు అభివృద్ధి చెందవు. ఈ వ్యాధి చాలా అరుదైన పుట్టుకతో వచ్చే రుగ్మత. జమ్మూకశ్మీర్ లోని కిష్త్వార్‌లో మారుమూల ప్రాంతంలోని సైనిక శిబిరంలో  శీతల్‌ భారత సైన్యం దృష్టిలో పడింది. ఆ బాలికకు శీతల్ పేరు పెట్టి.. చిన్నతనంలో భారత సైన్యం దత్తత తీసుకుంది.

పారా వరల్డ్ ఆర్చరీ ఛాంపియన్‌షిప్ పతకాన్ని గెలుచుకున్న చేతులు లేని తొలి మహిళగా శీతల్ నిలిచింది. జూలైలో సింగపూర్‌కు చెందిన అలీమ్ నూర్ సయాహిదాను 144-142తో ఓడించి బంగారు పతకాన్ని గెలుచుకుంది.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..