
సముద్ర గర్భం ఎన్నో వింతలకు నిలయం. పైకి చేపలు, సొరచేపలు, తిమింగాలు లాంటివి కనిపించినా.. ఆ సముద్రం ఎన్నో వింతైన చేపలను తన లోతైన గర్భంలో దాచుకుంటుంది. ఇక సరీసృపాలలో అనకొండలు భారీ కాయంతో మాత్రమే కాదు.. పొడవులోనే భీకరంగా ఉంటాయని తెలిసిందే. సాధారణంగా అనకొండలు సుమారు 15 నుంచి 30 అడుగుల వరకు పొడవు ఉంటాయి. దీంతో ఒక్క అనకొండను దగ్గర నుంచి చూడాలంటేనే గుండె ప్యాంట్‌లోకి వచ్చేస్తుంది. అలాంటిది ఓ చోట నాలుగైదు అనకొండలు తిష్ట వేసుకుని ఉంటే.. ఇంకేమైనా ఉందా.? ఊహించుకుంటేనే దడపుడుతోంది కదా..! ఆ కోవకు చెందిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దానిపై మీరూ ఓ లుక్కేయండి.
వైరల్ వీడియో ప్రకారం.. ఓ సొరంగం లాంటి ప్రాంతంలో నాలుగైదు అనకొండలు ఉన్నట్టు మీరు చూడవచ్చు. ఇక అక్కడికి ఎక్కడ నుంచి వచ్చిందో.. ఓ వింత ఆకారం.. నీటి అడుగున ఈడుతూ అనకొండల వైపు వస్తోంది. అది కూడా ఆకారం, పొడవులో భారీగా ఉంది. అసలే అనకొండలను చూస్తేనే దడుసుకుంటాం. పైగా ఈ వింత ఆకారాన్ని కూడా ఒకే చోట చూస్తే దెబ్బకు బెంబేలెత్తిపోతాం. మరి ఇంతకీ ఆ వింత ఆకారం ఏంటని మీరు అనుకుంటున్నారా.? దాన్ని సాలమండర్(Salamander) అని అంటారు.
Salamnder and Ananconda Face Off#Trending #TrendingNow #viral #viralvideo pic.twitter.com/7UUCekCf12
— telugufunworld (@telugufunworld) May 19, 2025
ఇవి ఉభయచరాల సమూహానికి చెందినవి. సాధారణంగా బల్లి రూపాన్ని కలిగి ఉంటాయి. సన్నని శరీరంతో మొద్దుబారిన ముక్కు, శరీరానికి లంబకోణంలో పొడుచుకువచ్చిన తోక ఉంటుంది. ఇవి విషపూరితమైన జీవులు కాకపోయినప్పటికీ.. వీటి శరీరం అంతా విషం నిండి ఉంటుంది. ఇవి 4 నుంచి 6 ఇంచ్‌లు మేరకు పొడవు పెరుగాతాయి. 25 నుంచి 30 కేజీల బరువు కూడా ఉంటాయి. లేట్ ఎందుకు ఆ వీడియోను మీరూ చూసేయండి.