మరణిస్తూ రూ. 45 కోట్ల ఆస్తులను పనిమనిషికి రాసిన 80 ఏళ్ల బామ్మ.. కోట్లు మెట్లు ఎక్కిన బంధువులు

|

Apr 06, 2024 | 1:01 PM

ఆ వృద్ధ మహిళ అవివాహితురాలు కనుక ఆమె ఆస్తికి కడుపున పుట్టిన పిల్లలు లేరు. దీంతో ఆస్తికి వారసులు లేరు. అయితే ఆమెకు బంధువులున్నారు. చాలా మంది మేనల్లుళ్ళు ఉన్నారు. దీంతో ఆ వృద్ధురాలి ఆస్తిని తన మేనల్లుళ్లు, కోడళ్ల పేర్ల మీద రాసేస్తుందని అందరూ భావించారు. అయితే వృద్ధ మహిళ తన ఆస్తి మొత్తం కేర్ టేకర్ కు రాసి ఇవ్వడంతో బంధువులను కలిచివేసింది.

మరణిస్తూ రూ. 45 కోట్ల ఆస్తులను పనిమనిషికి రాసిన 80 ఏళ్ల బామ్మ.. కోట్లు మెట్లు ఎక్కిన బంధువులు
Italy Woman
Follow us on

మానవ సంబంధాలన్నీ ఆర్ధిక బంధాలే.. కన్నతల్లికే తిండి పెట్టని పిల్లలు.. అన్న దమ్ములు, అక్క చెల్లెల్ల బంధాన్ని ఆస్తి, డబ్బులు, నగలు విడదీస్తున్నాయి. ఇలాంటి ఘటనలు రోజుకీ అనేకం చూస్తూనే ఉన్నాం.. అయితే తాజాగా 80 ఏళ్ల వృద్ధురాలు తన 45 కోట్ల విలువైన ఆస్తి మొత్తాన్ని తన కేర్‌టేకర్‌ పేరిట రాసిచ్చింది. ఈ ఘటన ఇటలీలో చోటుచేసుకుంది. వృద్ధురాలిని చూసుకుంటున్న వ్యక్తి పేరు మీద ఆస్థి రాసి ఇవ్వడంతో  ఆమె బంధువులు షాక్‌కు గురయ్యారు. ఆడిట్ సెంట్రల్ వెబ్‌సైట్ నివేదిక ప్రకారం మహిళకు ఎటువంటి  వారసులు లేరు.. కనుక ఆమె మొత్తం $5.4 మిలియన్లు  అంటే మన దేశ కరెన్సీలో దాదాపు రూ. 45 కోట్ల ఆస్తిని  అల్బేనియా నివాసి అయిన ఆమె కేర్‌టేకర్ పేరు మీద వ్రాసేసింది.

నివేదికల ప్రకారం మరియా అనే మహిళ, ఇటలీలోని ట్రెంటో ప్రావిన్స్‌లోని మరియా మల్ఫాట్టి అనే పట్టణానికి చెందిన రోవెరెటోలో చాలా ధనవంతుల కుటుంబంలోని సభ్యురాలు. ఆ వృద్ధురాలు అనేక అపార్ట్‌మెంట్‌లు, సిటీ సెంటర్‌లో ఒక చారిత్రాత్మక భవనం. లక్షలాది బ్యాంకు ఖాతాలతో సహా అనేక విలువైన ఆస్తులను కలిగి ఉన్నాడు. భర్త, పిల్లలు లేని ఆ మహిళ తన బాగోగులు చూసేందుకు ఓ కేర్‌టేకర్‌ను పెట్టుకుంది. అయితే గత నవంబర్‌లో ఆమె 80 ఏళ్ల వయసులో మరణించింది.

ఆ వృద్ధ మహిళ అవివాహితురాలు కనుక ఆమె ఆస్తికి కడుపున పుట్టిన పిల్లలు లేరు. దీంతో ఆస్తికి వారసులు లేరు. అయితే ఆమెకు బంధువులున్నారు. చాలా మంది మేనల్లుళ్ళు ఉన్నారు. దీంతో ఆ వృద్ధురాలి ఆస్తిని తన మేనల్లుళ్లు, కోడళ్ల పేర్ల మీద రాసేస్తుందని అందరూ భావించారు. అయితే వృద్ధ మహిళ తన ఆస్తి మొత్తం కేర్ టేకర్ కు రాసి ఇవ్వడంతో బంధువులను కలిచివేసింది.

ఇవి కూడా చదవండి

అయితే ఈ విషయం తెలుసుకున్న ఆ వృద్ధురాలి మేనల్లుడు న్యాయవాదిని సంప్రదించి.. వయసు రీత్యా మరియా మానసిక స్థైర్యాన్ని కోల్పోయిందని మరియా ఆస్తులను జప్తు చేయాలని కేసు పెట్టాడు. వృద్ధిరాలికి సేవ చేస్తూ ఈ అవకాశాన్ని కేర్ టేకర్ సద్వినియోగం చేసుకుందని ఆరోపించారు. అంతేకాదు వృద్ధురాలితో  బలవంతంగా ఆస్తి దస్తావేజుపై సంతకం చేయించారని కుటుంబ సభ్యులు కేసు పెట్టారు. ప్రస్తుతం ఈ వ్యవహారం కోర్టు మెట్లెక్కడంతో.. మేనల్లుళ్ల వాంగ్మూలంలో ఎంతవరకు నిజం ఉందనే కోణంలో విచారణ సాగుతోంది.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..