కొన్ని కొన్ని సందర్భాల్లో మనం ఆశ్చర్యకరమైన, షాకింగ్ దృశ్యాలను చూస్తుంటాం. మెరుపు వేగంలో కనిపించి వెళ్లే వాటిని చూసి ఆశ్చర్యపోతుంటాం. అయితే, కళ్లను మైమరపించే అలాంటి దృశ్యాలు.. కెమెరాలో రికార్డ్ అయితే? అయితే, ఏంటి ఇక్కడ అయ్యింది. అవును, కళ్లు బైర్లు కమ్మే దృశ్యం ఇంటి ఆవరణలో ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. ఆకాశంలో తోక చుక్కలు చూస్తుండగానే ఒక మెరుపు మెరిసి, కనుమరుగవుతుంటాయి. తాజాగా ఇలాంటి ఘటనే కాలిఫోర్నియాలో వెలుగు చూసింది. అయితే, ఇది ఆకాశంలో తోక చుక్క మాత్రం కాదు. ఓ ఇంటి ఆవరణలో రాత్రి వేళ విచిత్రమైన ఆకారం కనిపించింది. ఈ దృశ్యం.. ఇంటి వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. ఆ ఫుటేజ్‌ని పరిశీలించిన ఇంటి యజమాని.. ఆ వింత ఆకారం చూసి అవాక్కయ్యాడు. ఫుటేజీని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దాంతో అదికాస్తా వైరల్ అయ్యింది.
వైరల్ అవుతున్న ఈ వీడియోలో సరిగ్గా రాత్రి 10:09 గంటలకు సీసీ కెమెరా ముందు నుంచి ఓ వింత ఆకారం, అటు మనిషి, ఇటు వింత జీవిని పోలి ఉన్న ఆకారం.. వెళ్లింది. రెప్పపాటు సమయంలో దూసుకెళ్లిన ఆ వింత ఆకారాన్ని స్లో మోషన్‌లో చూసి షాక్ అయ్యాడు ఇంటి యజమాని. నెటిజన్లు సైతం ఆ ఆకారాన్ని చూసి అవాక్కవుతున్నారు. ఇదేదో ఏలియన్‌లా ఉందేంటి? అంటూ తమ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. వింత ఆకారంలో ఉండటం, మెరవడం, యూఎఫ్ఓ లా స్పీడ్‌గా వెళ్లంతో గ్రహాంతర జీవి అయి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మీరు కూడా ఈ ఆకారాన్ని చూసి అదేంటో చెప్పగలరేమో ట్రై చేయండి.
A Kingsburg resident is now looking at his camera footage questioning what he captured on Wednesday night around 10:09 p.m.
FULL STORY: https://t.co/cyt7AAeL5t
(Video: Hipolito Ramos) pic.twitter.com/qA296HX1ge— FOX26 News (@KMPHFOX26) July 22, 2023
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..