Viral Video: వరుడికి చిర్రెత్తుకొచ్చింది.. అందరూ చూస్తుండగానే ఇలా చేశాడేంటి..?
పెళ్లిళ్లలో జరిగే కొన్ని సంఘటనలు భలే విచిత్రంగా ఉంటాయి. ఇటీవల కాలంలో పెళ్లిళ్లలో ప్రాంక్ లని, వింత వింత పనులు చేస్తున్నారు.

Viral Video: పెళ్లిళ్లలో జరిగే కొన్ని సంఘటనలు భలే విచిత్రంగా ఉంటాయి. ఇటీవల కాలంలో పెళ్లిళ్లలో ప్రాంక్ లని, వింత వింత పనులు చేస్తున్నారు. అలాగే కొన్ని పెళ్లిళ్లలో వధూవరులు కొట్టుకోవడం వంటివి కూడా మనం చూస్తూ ఉంటాం.. ఇక ఇలాంటి వాటికి సోషల్ మీడియాలో మంచి డిమాండ్ ఉంది. వీటిని ఎక్కువగా వైరల్ చేస్తూ ఉంటారు నెటిజన్లు. తాజాగా అలాంటి వీడియోనే ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో వరుడికి చిర్రెత్తుకొచ్చింది. దాంతో అందరూ షాక్ అయ్యేలా చేశాడు. ఈ మధ్య కాలంలో ఈ చిన్న విషయం జరిగిన కేక్ కట్ చేయడం ఫ్యాషన్ అయిపోయింది. అలాగే పెళ్లిళ్లలో కూడా కేక్ కట్ చేయించి సెలబ్రేట్ చేస్తుంటారు. తాజాగా అదే సీన్ ఇక్కడ కాస్త బెడిసికొట్టింది.
పెళ్లిలో వరుడి చేత కేక్ కట్ చేయించాలని బంధువులు అనుకున్నారు. అనుకున్నట్టే కేక్ తెచ్చి వరుడి ముందు పెట్టారు. అతడు కూడా హ్యాపీగానే ఆ కేక్ కట్ చేశాడు కూడా.. అయితే అక్కడే ఉన్న వ్యక్తి ఆ కేక్ ను వరుడికి తినిపించాలని అనుకున్నాడు. కానీ అందుకు అతడు నిరాకరించాడు. అయినా సరే అతడిని కేక్ పట్టాలని ట్రై చేయడంతో వరుడికి చిర్రెత్తుకొచ్చింది. వెంటనే అతడి పై దూసుకెళ్లాడు. కోపంతో ఊగిపోయాడు. ఇంతలో వెనకున్న వ్యక్తి ఆపేందుకు ప్రయతించగా అతని పై కూడా సీరియస్ అయ్యాడు. అయినా కూడా ఉక్రోషం ఆపుకోలేక అక్కడ ఉన్న కేక్ ను తీసి విసిరికొట్టాడు. దాంతో అక్కడ ఉన్నవారంతా షాక్ అయ్యేరు. ఇప్పుడు ఈవీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.




View this post on Instagram
మరిన్ని వైరల్ వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి