Viral Video: సోషల్ మీడియా ‘ప్రపంచంలో’ పెళ్లి వేడుకలకు సంబంధించిన వీడియోలు తరచూ వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా వధూవరులకు సంబంధించిన వీడియోలు నెటిజన్లు ఎంతో ఆసక్తిగా వీక్షిస్తున్నారు. కొన్నిసార్లు వివాహ వేడుకక్కి సంబంధించిన అందమైన క్షణాలు వైరల్ అవుతున్నాయి. కొన్నిసార్లు వధూవరుల తో పాటు.. బంధువులు, స్నేహితులు చేసే అద్భుతమైన నృత్య ప్రదర్శనకు సంబందించిన వీడియోలు ఇంటర్నెట్‌లో ఓ రేంజ్ లో చక్కర్లు కొడుతుంటాయి. ప్రస్తుతం, అటువంటి వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఇందులో రిసెప్షన్ వేడుక తర్వాత వధువు ఫుల్ స్వింగ్‌లో డ్యాన్స్ చేస్తూ కనిపించింది. అదే సమయంలో.. వరుడు వేదికపై నిలబడి ఆమెను చూస్తూ నవ్వుతూ ఉన్నాడు.
వైరల్‌గా మారిన ఈ వీడియో.. పెళ్లి వేడుకలో వధూవరులు జయమాలను అలంకరించుకున్న అనంతరం పెళ్లి కూతురు డ్యాన్స్ చేస్తుండగా.. అప్పుడు ఈ వీడియో తీసినట్లు తెలుస్తోంది. వధూవరులిద్దరూ దండలు ధరించి ఉన్నారు. ఈ సమయంలో వధువు తన ఆనందాన్ని ఆపుకోలేకపోయింది. వెంటనే యువతి సంతోషంగా డ్యాన్స్ చేయడం ప్రారంభించింది. వైరల్ క్లిప్‌లో వేదికపై నిలబడిన వరుడు.. వధువు చేస్తోన్న డ్యాన్స్ నుచూసి సంతోషంగా నవ్వుతున్నాడు. వధువు ఈ విధంగా తన ఆనందాన్ని వ్యక్తం చేస్తుందని వరుడు బహుశా ఊహించి ఉండడు. ఈ సమయంలో.. ఎవరో వరుడిని పెళ్లి కూతురితో కలిసి డ్యాన్స్ చేయమంటూ ముందుకు నెట్టారు. అయితే పెళ్లి కొడుకు సిగ్గుతో కొంచెం వెనక్కి తగ్గాడు.
వధువు అద్భుతమైన డ్యాన్స్ వీడియో kalavidara_club అనే ఖాతాతో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఈ వీడియో ఇంటర్నెట్‌లో పెను సంచలనం సృష్టిస్తోంది. ఇప్పటివరకు 2 లక్షల మంది ఈ వీడియోను లైక్ చేయగా అనేక వ్యూస్ ను సొంతం చేసుకుంది.
నేను కూడా బహుశా నా పెళ్లిలో ఇలా డ్యాన్స్ చేస్తానని ఒకరు కామెంట్ చేయగా.. మరికొందరు తమ స్నేహితులకు ట్యాగ్ చేస్తూ తమ హర్షం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఈ పెళ్లికూతురు వీడియో నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది.
మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.