Viral Video: ఆఫ్రికా అబ్బాయి, భారతీయ యువతి ప్రేమపెళ్లిలో ఓ ఆసక్తికర సీన్‌..! బోరున ఏడ్చేసిన వధువు..!!

|

Jun 24, 2022 | 4:03 PM

చాలా మంది ప్రేమ జంటలు దేశం, సరిహద్దులు దాటి తమ ప్రేమను గెలిపించుకుంటున్నారు. మనసిచ్చిన వారినే పెళ్లి చేసుకుంటున్నారు. ఇటీవల కాలంలో పెళ్లిలకు సంబంధించిన అనేక వీడియోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. తాజాగా ఓ ప్రేమజంట

Viral Video: ఆఫ్రికా అబ్బాయి, భారతీయ యువతి ప్రేమపెళ్లిలో ఓ ఆసక్తికర సీన్‌..! బోరున ఏడ్చేసిన వధువు..!!
African Groom
Follow us on

ఈ రోజుల్లో చాలా మంది ప్రేమ జంటలు దేశం, సరిహద్దులు దాటి తమ ప్రేమను గెలిపించుకుంటున్నారు. మనసిచ్చిన వారినే పెళ్లి చేసుకుంటున్నారు. ఇటీవల కాలంలో పెళ్లిలకు సంబంధించిన అనేక వీడియోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. తాజాగా ఓ ప్రేమజంట పెళ్లి తంతు నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. అందులో వరుడు చేసిన పనికి వధువు ఎంతగానో మురిసిపోయింది. తనకు ఎంతో సంతోషానిచ్చిన ఆ మధుర క్షణాలకు సంబంధించిన ఆ వీడియోను ఆమె సోషల్‌ మీడియా ద్వారా నెటిజన్లతో పంచుకుంది. ఇక ఆ వీడియో నెట్టింట దూసుకుపోతోంది. ఇంతకీ ఏం జరిగిందంటే..

వైరల్‌ అవుతున్న వీడియోలో ఆఫ్రికా సంతతి వరుడు భారతీయ మహిళను వివాహం చేసుకున్నాడు. వీడియోలో అతను పెళ్లికి ముందు భారతీయ సంతతికి చెందిన వధువు మాతృభాష మలయాళంలో వివాహ ప్రమాణాలు చేస్తున్నాడు. మొదట ఇంగ్లిష్‌లో మొదలుపెట్టిన అతడు.. ఆ తరువాత అందరూ ఆశ్చర్యపొయేలా మలయాళంలో మాట్లాడాడు. తనకు ఓ అమూల్యమైన నిధి దొరికిందంటూ మనసులోని ప్రేమనంతా బయటపెట్టేశాడు. కాబోయే భర్తనోట ఈ మాట.. అదీ మలయాళంలో వినిపించడంతో ఉబ్బితబ్బిబ్బైపోయిన వధువు పట్టరాని ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంది. ఇది చూసిన పెళ్లికి హాజరైన వారంతా చప్పట్లు కొట్టి అతడిని ఉత్సాహపరిచారు. ఈ వీడియోను యెహోవా జూలియన్ ప్రియర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.

ఇవి కూడా చదవండి

దానికి ఆమె క్యాప్షన్‌లో ఇలా రాసింది, ‘నా భర్త మా వివాహ ప్రమాణాలను నా మాతృభాష మలయాళంలో నేర్చుకున్నాడు అందరి ముందు మలయాళంలోనే ప్రమాణం చేశాడు. ఇది చూసిన నా కళ్లలో నీళ్లు తిరిగాయంటూ ట్విట్‌ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైరల్‌గా మారిన ఈ వీడియోను చూసి నెటిజన్లు తెగ ముచ్చటపడుతున్నారు. ఈ వార్త రాసే సమయానికి వీడియోకి లక్షల సంఖ్యలో వ్యూస్‌ వచ్చాయి.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి