
కొన్ని కొన్ని దృశ్యాలు చూస్తే ఎంతటి కఠిన మనస్కులకైనా గుండె బరువెక్కినట్లుగా అనిపిస్తుంటుంది. కఠిన పాశాన హృదయులను సైతం కంటతడి పెట్టిస్తుంది. తాజాగా అంతకు మించి హార్ట్ టచింగ్ వీడియో ఒకటి సోషల్ మీడియాను ఊపేస్తుంది. మనిషి జీవితంలో పుట్టుక నుంచి చావు వరకు.. శిశువు, యవ్వనం, వృద్ధాప్యం దశలు ఉంటాయి. వీటిలో శిశువుగా ఉన్నప్పుడు మనం స్వయంగా ఏమీ చేయలేము. మన తల్లిదండ్రులు మనల్ని పెంచి పెద్ద చేస్తారు. యవ్వన దశకు వచ్చాక.. ఎవరి జీవితాన్ని వారు నెట్టుకొస్తారు. ఇక వృద్ధాప్యంలోకి వచ్చాక.. సేమ్ టు సేమ్ శిశు దశలో ఉన్నట్లే ఉంటుంది పరిస్థితి. మన పనులను కూడా మనం చేసుకోలేని పరిస్థితి ఉంటుంది. కాళ్లు, చేతులు చావచచ్చిపోతాయి. నడవడం సంగతి అటుంచితే.. కనీసం కడుపు నింపుకోవడానికి అన్నం కూడా తినరాని పరిస్థితి ఉంటుంది.
అయితే, ప్రస్తుత కాలంలో చాలామంది తమ పెద్దలకు సేవ చేసే సమయం లేక.. ఓల్డేజ్ హోమ్‌లో వేస్తున్నారు. డబ్బులు కట్టి, వారికి సేవలు అందిస్తున్నారు. మనుషులు కాబట్టి ఇన్ని సేవలు అందుబాటులో ఉన్నాయి. మరి ఎప్పుడైనా జంతువులు, పక్షుల గురించి ఆలోచించారా? మనుషుల మాదిరిగానే జంతువులు, పక్షులు కూడా వృద్ధాప్యాన్ని అనుభవిస్తాయి. మరి వాటికి సేవ ఎవరు చేస్తారు? వాటి ఆలనా పాలనా చూసుకునేది ఎవరు? వాటికి తిండి పెట్టేది ఎవరు? అని ఎప్పుడైనా ఆలోచించారా? అలాంటి ఆలోచనను తట్టిలేపే, హృదాయాన్ని ద్రవింపజేసే వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
వైరల్ అవుతున్న ఈ వీడియోలో.. వృద్ధాప్యంతో బాధపడుతూ పైకి ఎగరలేక, ఆహారం సేకరించలేక అవస్థలు పడుతున్న ఓ వృద్ధ పక్షికి మరో పక్షి ఆసరాగా నిలిచింది. ఆహారం అందిస్తూ.. దాని కడుపు నింపింది. కనీసం కదల లేకపోతున్న పెద్ద పక్షికి.. ఓ చిన్ని పక్షి సాయం చేసింది. హార్ట్ టచింగ్, బ్యూటీఫుల్ వీడియోను మాజీ లెఫ్ట్‌నెంట్ గవర్నర్, మాజీ ఐపీఎస్ అధికారిణి కిరణ్ బేడీ తన ట్విట్టర్ అకౌంట్‌లో షేర్ చేశారు. ‘మనుషులకంటే.. ఓల్డేజ్ హోమ్స్ ఉన్నాయి.. మరి పక్షులకు ఎవరున్నారు?’ అంటూ క్యాప్షన్ పెట్టారు. ఈ వీడియోను చూసి నెటిజన్లు చలించిపోతున్నారు. మరెందుకు ఆలస్యం.. మీరు కూడా ఓ లుక్కేసుకోండి.
Old age Birds cannot fly and there are no old age Homes for them. Therefore, the small baby birds are feeding them.
Good #MorningNutrition pic.twitter.com/urL26Z5V8Y— Kiran Bedi (@thekiranbedi) January 23, 2023
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..