Viral Video: పెంపుడు జంతువులుగా చిరుతపులులు.. ఆ పని కోసం వాడేవారని మీకు తెలుసా.. రేర్ వీడియో మీ కోసం..
ప్రస్తుతం చిరుతలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. నమీబియా నుంచి తీసుకువస్తున్న ఎనిమిది చిరుతలను భారత్‌కు తీసుకురావడమే ఇందుకు కారణం. దేశంలో 70 ఏళ్ల తర్వాత చిరుతలు మళ్లీ కనిపించనున్నాయి...
ప్రస్తుతం చిరుతలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. నమీబియా నుంచి తీసుకువస్తున్న ఎనిమిది చిరుతలను భారత్‌కు తీసుకురావడమే ఇందుకు కారణం. దేశంలో 70 ఏళ్ల తర్వాత చిరుతలు మళ్లీ కనిపించనున్నాయి. 1952లో అంతరించిపోయిన ఈ చిరుతలు దాదాపు 8 వేల కిలోమీటర్లు ప్రయాణించి మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌కు వచ్చాయి. మూడు మగ, ఐదు ఆడ చిరుతలను ఇండియాకు తీసుకువచ్చారు. అయితే భారతదేశంలో ఒకప్పుడు చిరుతలు అధిక సంఖ్యలో ఉండేవన్న విషయం మీకు తెలుసా? వందల సంవత్సరాల క్రితం దేశంలో సుమారు 10 వేల చిరుతలు ఉండేవి. వేటాడటం, మనుగడ కొనసాగించలేకపోవడం వంటి కారణంగా వాటి సంఖ్య క్రమంగా తగ్గిపోయింది. చివరికి అంతరించిపోయింది. ప్రస్తుతం చిరుతలకు సంబంధించిన ఓ పాత వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దేశంలో చిరుతలను కూడా పెంపుడు జంతువులుగా పెంచేవారని, వాటిని వేటకు ఉపయోగించారని మీకు తెలుసా. వాస్తవానికి, మానవులు మొదట చిరుతలను వేటాడి, ఆపై వాటిని పెంపుడు జంతువులుగా మార్చేవారు. వీటి ద్వారా వివిధ రకాల జంతువులను వేటాడేందుకు ఉపయోగించారు. వైరల్ అవుతున్న వీడియోలో రెండు చిరుతలు మంచాలపై కూర్చున్నట్లు కనిపిస్తాయి. వాటి మెడలో పట్టీ ఉండటాన్ని మీరు గమనించవచ్చు. అక్కడ నిలబడి ఉన్న ఓ వ్యక్తి చిరుతకు కమాండ్స్ ఇస్తున్నాడు. తర్వాత చిరుతలను ఎడ్ల బండిలో అడవికి తీసుకెళ్లి విడిచిపెట్టడం కనిపిస్తుంది. అప్పుడు చిరుతలు పరిగెత్తి ఇతర జంతువులను వేటాడతాయి.
When #Cheetah are coming back to #India. A look at how the last of the lots were hunted, maimed and domesticated for hunting parties. Video made in 1939. 1/n pic.twitter.com/obUbuZoNv5
ఇవి కూడా చదవండి— Parveen Kaswan, IFS (@ParveenKaswan) September 16, 2022
ఈ వీడియోను IFS అధికారి పర్వీన్ కస్వాన్ తన ట్విట్టర్ హ్యాండిల్‌లో పంచుకున్నారు. ఈ క్లిప్ 1939 సంవత్సరం నాటిది. రెండు నిమిషాల 12 సెకన్ల నిడివి కలిగిన ఈ వీడియోను ఇప్పటి వరకు 1 లక్షకు పైగా వ్యూస్, 5 వేల కు పైగా లైక్స్ వచ్చాయి. అంతే కాకుండా వీడియో చూసిన తర్వాత నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..