Viral Video: వర్షాకాలం రోడ్లతో జాగ్రత్త.. ఆదమరిస్తే ఇంతే.. వణికిస్తున్న షాకింగ్ వీడియో
భారతదేశ రవాణా వ్యవస్థలో రోడ్లు (Roads) అత్యంత కీలకం. సులభతర రవాణా మార్గానికి చాలా మంది రోడ్లనే ఆశ్రయిస్తుంటారు. ప్రధాన నగరాలు మొదలుకుని గ్రామస్థాయి ప్రాంతాల వరకు రకరకాల రోడ్లు ఉన్నాయి. అయితే రోడ్లపై నడుస్తూ వెళ్లేటప్పుడు, డ్రైవ్...
భారతదేశ రవాణా వ్యవస్థలో రోడ్లు (Roads) అత్యంత కీలకం. సులభతర రవాణా మార్గానికి చాలా మంది రోడ్లనే ఆశ్రయిస్తుంటారు. ప్రధాన నగరాలు మొదలుకుని గ్రామస్థాయి ప్రాంతాల వరకు రకరకాల రోడ్లు ఉన్నాయి. అయితే రోడ్లపై నడుస్తూ వెళ్లేటప్పుడు, డ్రైవ్ చేస్తున్న సమయంలో అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ప్రమాదం ఎప్పుడు ఎక్కడి నుంచి వస్తుందో ఎవ్వరూ ఊహించలేరు. ఇక వర్షాకాలంలో వీటి పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా మనకే హాని కలుగుతుంది. కాగా సోషల్ మీడియాలో (Social Media) ఇలాంటి వీడియోలు నిత్యం వైరల్ అవుతుంటాయి. ఈ వీడియోలు కొన్ని ప్రజలను ఆశ్చర్యపరుస్తుండగా.. మరికొన్ని మనస్సులకు హత్తుకుంటాయి. కొన్ని మాత్రం తీవ్ర భయాందోళనకు గురి చేస్తాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ఓ వీడియో కాస్త ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ వీడియోలో ఓ మహిళ రోడ్డుపై నడుస్తుండగా అకస్మాత్తుగా రోడ్డు తెగిపోయింది. ఆమె అందులో పడిపోయింది. వర్షం కారణంగా రోడ్డు కూలిపోయి ఉండొచ్చన్న విషయం వీడియో చూస్తే మనకు అర్థమవుతోంది.
ఇవి కూడా చదవండి— Shocking Videos (@ShockingClip) August 12, 2022
రోడ్డులోని కొంత భాగం ఒక్కసారిగా కుప్పకూలడంతో మహిళ అందులో పడిపోయింది. అయినా ఆమెకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మహిళ గోతిలో పడిపోయిన సమయంలో పక్కనే నిలబడి ఉన్న ఓ వ్యక్తి ఆ మహిళను గొయ్యి నుంచి బయటకు తీసేందుకు సహాయం చేస్తారు. ఈ షాకింగ్ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో పోస్ట్ అయింది. కేవలం 5 సెకన్ల ఈ వీడియోను ఇప్పటివరకు 70 వేలకు పైగా వీక్షించారు. అంతే కాకుండా నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..