ప్రకృతి ఎన్నో సవాళ్లతో కూడుకున్నది. కనిపించినంత అందగా అందులో నివసించే జంతువులకు ఉండదు. జీవనం కోసం నిత్యం ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. బతుకు కోసం నిత్యం పోరాటమే. నీటిలో ప్రమాదకరమైన జంతువు ఏదైనా ఉందంటే.. అది మొసలి అనే చెప్పాలి. నీళ్లల్లో ఉన్నప్పుడు దానికి చాలా శక్తి ఉంటుంది. తన కంటే పెద్ద జంతువునైనా ఇట్టే అవలీలగా పట్టేసి స్వాహా చేసేస్తుంది. మనిషిని సైతం మింగేసే సామర్థ్యం దానికి ఉంది. మరోవైపు.. తాబేలు కూడా ఏ మాత్రం తీసిపోదు. వేటాడుకున్నప్పటికీ అది ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకోగలదు. ఇక మొసలి, తాబేలు రెండూ నీటిలోనే ఉంటాయి కాబట్టి తాబేలు మొసలికి ఆహారంగా మారడం కామన్. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో చాలానే ఉన్నాయి. అంతే కాకుండా వీటిని చూసేందుకు నెటిజన్లు ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు. కానీ ఈ వీడియో మాత్రం అది తప్పని నిరూపిస్తుంది. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తోంది. తాబేలు చేసిన పనికి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.
السلحفاة والتمساح رايكم ؟؟ pic.twitter.com/WW2vC4TfNG
ఇవి కూడా చదవండి— عالم الحيوان (@bkbuc) October 1, 2022
వైరల్ అవుతున్న ఈ క్లిప్ లో తాబేలు ఒడ్డున ఉన్న సమయంలో మొసలి సడెన్ గా ఎటాక్ చేస్తుంది. నోటితో పెట్టుకుని మింగేందుకు ప్రయత్నిస్తుంది. కానీ మొసలికి సాధ్యం కాలేదు. తాబేలుపై ఉండే షెల్ కారణంగా మొసలికి తినలేకపోయింది. ఇలా చాలా సార్లు ప్రయత్నించి విఫలమవుతుంది. దీంతో మొసలి తాబేలును వదిలేస్తుంది. చావు నుంచి బయటపడిన తాబేలు బతుకు జీవుడా అనుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ట్విట్టర్‌లో పోస్ట్ అయింది. ఈ క్లిప్ కు ఇప్పటి వరకు వ్యూస్, లైక్స్ భారీగా వస్తున్నాయి. అంతే కాకుండా తమదైన స్టైల్ లో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ‘ఈ ప్రపంచంలో మిమ్మల్ని మీరు రక్షించుకోవాలనుకుంటే తాబేలులా ఉండాలి.’ అని తమ అభిప్రాయాలను రాస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..