పిప్పరమెంట్లు, క్యాండీలు.. చిన్నా పెద్దా అందరికీ ఫేవరెట్. ఇండియన్ ఫుడ్ మార్కెట్ లో ఇవి ఎప్పుడూ ముందువరసలోనే ఉంటాయి. సాధారణంగా టాఫీలు, క్యాండీలు లేదా పిప్పిర్‌మెంట్‌లు తియ్యగా ఉంటాయి. వీటిని రకరకాల ఫ్లేవర్స్ లోనూ తయారు చేస్తుంటారు. అసాధారణ అసిడిక్ ఫ్లేవర్స్‌ను కలుపుతూ భిన్న ఆకృతుల్లో రూపొందిస్తుంటారు. దాంతో ఈ పిప్పరమెంట్‌లు కొన్ని తియ్యగా, కొన్ని తీపి, పులుపు కలబోతగా, ఇంకొన్ని తియ్యగా ఘాటుగా ఉంటాయి. అయితే భారతదేశంలోని ఈ అన్నిరకాల పిప్పర్‌మెంట్‌లు ఫేమస్సే.. కానీ, ఇటీవల ఘాటుగా ఉండే పల్స్ కంపెనీ పిప్పర్‌మెంట్ పేరు మారుమోగుతోంది.
భారత్‌లో పిప్పర్‌మెంట్‌ల ప్రాముఖ్యతను తెలుసుకున్న హ్యోజియోంగ్ పార్క్ అనే కొరియన్ యువతి.. పల్స్ కంపెనీ పిప్పర్‌మెంట్ కొని తిని చూసింది. అంతే ఆమె ముఖంలో ఎక్స్‌ప్రెషన్స్ ఒక్కసారిగా మారిపోయాయి. ఆ పిప్పరమెంట్ ఘాటును భరించలేక కెవ్వుమంటూ అరిచింది. నాలుక మంట ఓర్చుకోలేక ఏడ్చినంత పనిచేసింది. వీడియో బ్లాగర్ అయిన ఆ కొరియన్ యువతి ఈ వీడియోను ఇన్‌స్టాలో షేర్ చేసింది. ఇండియన్ క్యాండీ నన్ను ఏడిపించింది. దాన్ని నాకు ఎవరు రికమెండ్ చేశారు..? అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది.
ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను ఇప్పటికే లక్షలాదిమంది వీక్షిస్తూ లైక్ చేస్తూ తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..