Trending Video: ఇదేందయ్యా ఇది.. మందు కొడుతున్న కోడి.. వేషాలు మాములుగా లేవుగా..
మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. ఇది అందరికీ తెలిసిందే. మద్యం సీసాలపై కూడా ఇదే ఉంటుంది. కానీ.. మందుబాబులు ఊరుకుంటారా.. చుక్కేస్తే గానీ ముద్ద దిగని వాళ్లు కోకొల్లలు. మద్యం తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య...

మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. ఇది అందరికీ తెలిసిందే. మద్యం సీసాలపై కూడా ఇదే ఉంటుంది. కానీ.. మందుబాబులు ఊరుకుంటారా.. చుక్కేస్తే గానీ ముద్ద దిగని వాళ్లు కోకొల్లలు. మద్యం తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయి. హాస్పిటల్స్ కు లక్షలకు లక్షలు ఖర్చు చేయాల్సి వస్తుంది. ఇదంతా తెలిసినా.. మద్యం తాగే అలవాటును మాత్రం వదులుకోలేరు. తాగకుండా ఒకరోజు కూడా బతకలేనంతగా మద్యపానానికి అలవాటు పడే వారు చాలా మందే ఉన్నారు. తాగకుండా ఏ పనీ చేయని వారూ అనేకమే. తాగిన తర్వాతే ఏ పనైనా చక్కగా చేయగలిగిన వారూ లేకపోలేదు. అలాంటి వారిని మీరు కూడా చూసి ఉండవచ్చు. సాధారణంగా మద్యం తాగితే మత్తుతో తూలుతారు. కొన్ని సార్లు ఓవర్ డోస్ అయితే కింద పడిపోతారు కూడా. కనీసం లేచి నడిచేంత ఓపిక కూడా ఉండదు. అయితే మీరు.. ఎప్పుడైనా కోడి మద్యం తాగడాన్ని చూశారా.. లేకుంటే ఈ వీడియోలో చూసేయండి.
మద్యం తాగిన కోతి గురించి తెలుసు.. ఇప్పుడు మద్యం తాగిన కోడి కథ ఏంటి అని ఆలోచిస్తున్నారా.. అబ్బే అదేం లేదండి. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఓ కోడి.. గ్లాసులో ఉన్న మద్యాన్ని గుటుక్కుమనిపించింది. కేవలం ఒక సిప్ మాత్రమే తాగుతుంది. మరి టేస్ట్ నచ్చలేదో ఏమిటో.. అక్కడి నుంచి వెళ్లిపోవాలని డిసైడ్ అయిపోయింది. కానీ అప్పటికే అది మందు తాగింది. అలాంటప్పుడు మందు దేవుడు ఊరుకుంటాడా. కోడి అక్కడి నుంచి మత్తుతో తూలుతూ, తూగుతూ అక్కడి నుంచి వెళ్లడాన్ని చూడవచ్చు.




View this post on Instagram
ఈ ఫన్నీ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో బావాబూజ్ అనే ఐడితో పోస్ట్ అయింది. దీనికి ఇప్పటివరకు 61 వేలకు పైగా వ్యూస్.. వందల సంఖ్యలో లైక్స్ వచ్చాయి. అంతే కాకుండా వీడియో చూసిన తర్వాత నెటిజన్లు తమ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో రాస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..