Watch Video: అర్జెంట్‌గా టాయిలెట్‌కి వెళ్లాడు.. అక్కడ కనిపించిన దృశ్యం చూసి షాక్
పామును చూస్తేనే కొంతమంది భయంతో హడలెత్తిపోతారు. సాధారణంగా పాములు ఇంట్లోకి చొరబడుతూ ఉంటాయి. వాటిని పట్టుకునేందుకు కుటుంబ సభ్యులు నానా తంటాలు పడుతుంటారు. ఏదైన తేడా జరిగితే పాము కాటువేయండం ఖాయమే. అందుకే చాలామంది ప్రత్యేకంగా పాములు పట్టేవారిని పిలిపించి దాన్ని దూరంగా వదిలేస్తుంటారు.
పామును చూస్తేనే కొంతమంది భయంతో హడలెత్తిపోతారు. సాధారణంగా పాములు ఇంట్లోకి చొరబడుతూ ఉంటాయి. వాటిని పట్టుకునేందుకు కుటుంబ సభ్యులు నానా తంటాలు పడుతుంటారు. ఏదైన తేడా జరిగితే పాము కాటువేయండం ఖాయమే. అందుకే చాలామంది ప్రత్యేకంగా పాములు పట్టేవారిని పిలిపించి దాన్ని దూరంగా వదిలేస్తుంటారు. మరికొందరైతే కర్రలతో చంపేస్తారు కూడా. ప్రస్తుతం సోషల్ మీడియాలో పాములు కంటబడే వీడియోలు కూడా ట్రెండింగ్ లోకి వెళ్లిపోతున్నాయి. తాజాగా ఓ ఇంట్లోని బాత్రుం కమోడ్ లో నక్కిన పాము వీడియో వైరలవుతోంది.
మొదటగా బాత్రూంకని వెళ్లిన వ్యక్తి ఆ పాము కనిపించడంతో భయంతో వణికిపోయాడు. వెంటనే బయటకు వచ్చి కుటుంబ సభ్యలకు చెప్పడంతో వారు దగ్గర్లోని పాములు పట్టే వ్యక్తిని పిలిపించారు. వీడియోలో చూస్తే బాత్రుం కమోడ్‌లోపల పాము తలదాచుకుంది. అక్కడికి వచ్చిన అతను ఆ పామును చాకచాక్యంగా బయటకు తీశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింటా వైరలవుతోంది.
View this post on Instagram
మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..