Viral video: ఏం ధైర్యం సామీ.. పాముకు సీపీఆర్ చేసిన పోలీస్. వైరల్ వీడియో..
మనిషి శ్వాస తీసుకోలేని సమయంలో నోటి ద్వారా శ్వాసను అందించడం ద్వారా మనిషిని బతికిస్తారు. అయితే ఇలాంటి సీపీఆర్‌ను పాముకు చేస్తే ఎలా ఉంటుంది. అచ్చంగా మనిషి నోట్లో ఊదినట్లు పాము నోట్లో గాలి ఊదితే ఎలా ఉంటుంది.? ఊహించుకోవడానికే భయంగా ఉంది కదూ.! కానీ మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ పోలీస్ ఆఫీసర్ మాత్రం పాముకు సీపీఆర్ చేసిన అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు...

మనిషి అనుకోకుండా అపస్మారక స్థితిలోకి వెళ్లినప్పుడు సీపీఆర్ నిర్వహిస్తారనే విషయం తెలిసిందే. ఇటీవలి కాలంలో గుండె పోటుతో ఉన్నట్లుండి పడిపోతున్న వారికి ఇలా సీపీఆర్ నిర్వహించి తిరిగి స్పృహలోకి తీసుకొచ్చిన సంఘటనలు చూసే ఉంటాం. కృత్రిమంగా శ్వాసను అందించి మనిషి గుండెను తిరిగి యాక్టివేట్ చేయడమే ఈ సీపీఆర్ విధానం ముఖ్య ఉద్దేశం.
మనిషి శ్వాస తీసుకోలేని సమయంలో నోటి ద్వారా శ్వాసను అందించడం ద్వారా మనిషిని బతికిస్తారు. అయితే ఇలాంటి సీపీఆర్‌ను పాముకు చేస్తే ఎలా ఉంటుంది. అచ్చంగా మనిషి నోట్లో ఊదినట్లు పాము నోట్లో గాలి ఊదితే ఎలా ఉంటుంది.? ఊహించుకోవడానికే భయంగా ఉంది కదూ.! కానీ మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ పోలీస్ ఆఫీసర్ మాత్రం పాముకు సీపీఆర్ చేసిన అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది..
మధ్యప్రదేశ్‌లోని నర్మదాపురంలో క్రిమి సంహారక మందు కలిపిన నీటిని తాగిన ఓ పాము స్పృహప్పిపోయి, అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. దీంతో అక్కడే ఉన్న ఓ కానిస్టేబుల్ ఇది గమనించి వెంటనే పామును బతికించాలనుకున్నాడు. అనుకున్నదే తడువుగా వెంటనే ఆ పామును చేతిలోకి తీసుకొని శ్వాస ఆడుతుందో లేదో చెక్ చేశాడు. పాము శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుందని గమనించిన కానిస్టేబుల్ పాము నోట్లో నోరు పెట్టి శ్వాసను అందించడం ప్రారంభించాడు.
వైరల్ వీడియో…<
A video from Narmadapuram has gone viral where a police constable is giving CPR to a snake that had fallen unconscious after being drenched in pesticide laced toxic water. pic.twitter.com/tblKDG06X6
— Anurag Dwary (@Anurag_Dwary) October 26, 2023
/h3> ఇలా రెండు సార్లు చేసేసరికి పాము స్పృహలోకి వచ్చింది. దీంతో పామును వదిలేశాడు. దీనంతటినీ అక్కడే ఉన్న వారు వీడియోగా తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వీడియో కాస్త తెగ వైరల్ అవుతోంది. అనురాగ్ ద్వారీ అనే వ్యక్తి తన ట్విట్టర్ అకౌంట్‌లో ఈ వీడియోను పోస్ట్ చేశాడు. దీంతో ఈ వీడియో చూసిన నెటిజన్లు కానిస్టేబుల్ ధైర్యానికి హ్యాట్సాఫ్ చెబుతున్నారు. పామును కాపాడిన ఆ కానిస్టేబుల్ పరు అతుల్ శర్మగా గుర్తించారు. ఏది ఏమైనా పోలీస్ ఆఫీసర్ చూపించిన ధైర్యానికి సెల్యూట్ చేయాల్సిందే కదూ.!
మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..