Watch Video: ఓరీ దేవుడో మ్యాగీని ఇలా కూడా అమ్ముతారా..? ఇవి తింటే ఉంటామనే గ్యారెంటీ ఉందో లేదో మరీ..!

|

Mar 15, 2024 | 9:54 AM

చాలా మంది వినియోగదారులు ఈ వీడియోపై స్పందించారు. ఒక వినియోగదారు ఇలా వ్రాశారు.. దానికి గడువు ముగిసింది. దయచేసి ఇలాంటి మ్యాగీని విక్రయించండి అని ఒక వినియోగదారు రాశారు, “క్యాన్సర్ కార్ట్” అని మరొక వినియోగదారు రాశారు, “బాప్రే, దుమ్ము, కాలుష్యం” అని రాశారు. ఈ మ్యాగీ గడువు తేదీ దాటిపోయిందని చాలా మంది వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వీడియోకు ఏడు లక్షలకు పైగా లైక్‌లు, ఐదు వేలకు పైగా కామెంట్లు వచ్చాయి.

Watch Video: ఓరీ దేవుడో మ్యాగీని ఇలా కూడా అమ్ముతారా..? ఇవి తింటే ఉంటామనే గ్యారెంటీ ఉందో లేదో మరీ..!
Maggi Noodles
Follow us on

మ్యాగీ అంటే పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టపడతారు. పిల్లలకు చాలా ఇష్టమైన ఆహారాలలో ఇది కూడా ఒకటి. సాధారణంగా ప్యాకెట్లలో విక్రయించే మ్యాగీని అందరం కొనుకుని తింటాము. కానీ మీరు ఎప్పుడైనా మ్యాగీ బండిపై కుప్పగా పోసి అమ్మటం చూశారా? మ్యాగీని బండిపై ఎలా విక్రయిస్తారని ఆశ్చర్యపోతున్నారు కదా..? అందుకోసం ఈ వీడియో చూడాల్సిందే. ఈ వీడియోలో ఓ వ్యక్తి మ్యాగీని ఎలా విక్రయిస్తున్నాడో చూస్తే మీరు షాక్‌తో నోరెళ్ల బెట్టాల్సిందే. ఎవరైనా వండిన మ్యాగీని తింటారు. కానీ పచ్చి మ్యాగీని ఇలా అమ్మడం మీరు చూడటం ఇదే మొదటిసారి అనుకుంటా. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

ఈ వైరల్ వీడియో ఒక వ్యక్తి తోపుడు బండిపై మ్యాగీని విక్రయిస్తున్నాడు. అతని తోపుడు బండిపై పచ్చి మ్యాగీని కుప్పగా పోశాడు. మ్యాగీ పక్కనే బ్యాగ్‌లో నూడుల్స్, బ్యాగ్‌లో మ్యాగీ మసాలా ప్యాకెట్ కూడా కనిపిస్తున్నాయి.. కావాలనుకున్న వారికి అతడు ఈ మ్యాగీని సరిగ్గా తూకం వేసి అమ్మటం మీరు వీడియోలో చూడొచ్చు.. ఆ తర్వాత అందులో మ్యాగీ మసాలా ప్యాకెట్‌ వేస్తున్నాడు. మ్యాగీతో పాటుగా మ్యాగీ మసాలా ప్యాకెట్‌ను ప్లాస్టిక్‌ బ్యాగ్‌లో నింపి కస్టమర్‌కు అందిస్తు్న్నాడు.. సీల్డ్‌ ప్యాకెట్ కంటే ఎక్కువ పరిమాణంలో ఇక్కడ మ్యాగీ లభిస్తుండడంతో చాలా మంది ఆసక్తిగా కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం తోపుడు బండిపై మ్యాగీకి సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇవి కూడా చదవండి

ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్ ఖాతా chatore_brothers నుండి షేర్‌ చేశారు. ఈ వీడియో క్యా్ప్షన్‌లో ఇలా రాసి ఉంది.. అర్థ రాత్రి ఒంటిగంట వరకు కూడా ప్రజలు మ్యాగీని తింటారు.. ఇది మీకు అందుబాటులో ఉంటుంది. స్కూల్‌ లంచ్‌ బాక్స్‌ నుండి కాలేజీ క్యాంటీన్ వరకు అందరూ మ్యాగీని గుర్తుంచుకుంటారు. అడవులు, కొండల్లో కూడా మ్యాగీ గుర్తుకు ఉంటుంది అని.. ఇక చాలా మంది వినియోగదారులు ఈ వీడియోపై వ్యాఖ్యానించారు. ఒక వినియోగదారు ఇలా వ్రాశారు.. దానికి గడువు ముగిసింది. దయచేసి ఇలాంటి మ్యాగీని విక్రయించండి అని ఒక వినియోగదారు రాశారు, “క్యాన్సర్ కార్ట్” అని మరొక వినియోగదారు రాశారు, “బాప్రే, దుమ్ము, కాలుష్యం” అని రాశారు. ఈ మ్యాగీ గడువు తేదీ దాటిపోయిందని చాలా మంది వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వీడియోకు ఏడు లక్షలకు పైగా లైక్‌లు, ఐదు వేలకు పైగా కామెంట్లు వచ్చాయి.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..