
సోషల్ మీడియాలో తమకంటూ ఓ గుర్తింపు రావాలని చాలామంది వివిధ స్టంట్లు చేస్తుంటారు. కొన్నిసార్లు ప్రాణాలకు ముప్పు ఉండే స్టంట్లు కూడా చేసేందుకు వెనకాడరు. తాజాగా అలాంటి ఓ భయంకరమైన స్టంట్‌ని ఒడిశాలో ఓ యువకుడు చేశాడు. వివరాల్లోకి వెళ్తే బోలాన్ జిల్లాలోని పట్నాగర్హ్ పట్టణానికి వెళ్లే మార్గంలో రహాదారిపై ఊరిపేరు కనబడేలా ఓ పెద్ద సైన్బోర్టును స్థానికులు ఏర్పాటుచేసుకున్నారు. అయితే ఆ బోర్డుపైకి ఓ యువకుడు ఎక్కాడు. అంతేకాదు అక్కడ ప్రమాదకరంగా పుషప్స్ చేశాడు. రోడ్డుపై వాహనాలు వెళ్తుండగానే అతను ఇలాంటి ప్రమాదకరమైన స్టంట్ చేశాడు.
ఎదైనా చిన్న తేడా జరిగి పై నుంచి కిందపడితే ప్రాణాలకే ప్రమాదం. అయినప్పటికీ కూడా ఆ బోర్డుపై ఆ యువకుడు పుషప్స్ చేయడాన్ని చూసి రోడ్డుపై వెళ్లేవారంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతుంది. నెటిజన్లు తమ భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మీరు కూడా ఆ వీడియోను చూసేయండి.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..