Dangerous Stunt : వార్నీ.. ఇవెక్కడి స్టంట్స్‌రా సామీ.. ఇలాంటి పుష్‌అప్స్‌తో కండలు కాదు.. ప్రాణాలు పోతాయ్..

|

Dec 10, 2024 | 12:47 PM

సాహసం పేరుతో విపరీతమైన పనులు చేసేందుకు పూనుకునే వారికి సోషల్ మీడియా పెద్ద అడ్డ..ఇక్కడ ఇలాంటి వీడియోలకు కొదువ లేదు. రీల్స్ మోజులో పడి చాలా మంది ప్రాణాలను రిస్క్‌లో పెడుతున్నారు. స్టంట్ షో పేరుతో ఓ యువకుడు చేసిన షాకింగ్‌ సీన్‌ ఇప్పుడు ఇంటర్‌నెట్‌లో వైరల్ అవుతోంది. రీల్స్‌ పిచ్చితో యువకుడు మితిమీరి చేస్తున్న ప్రమాదరకరమైన పని తీవ్ర విమర్శలకు దారితీసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ షాకింగ్‌ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.

Dangerous Stunt : వార్నీ.. ఇవెక్కడి స్టంట్స్‌రా సామీ.. ఇలాంటి పుష్‌అప్స్‌తో కండలు కాదు.. ప్రాణాలు పోతాయ్..
Dangerous Stunt
Follow us on

రీల్స్ చేస్తూ వేగంగా ప్రపంచ ప్రసిద్ధి చెందాలనే ఆరాటంతో కొంతమంది ఎలాంటి రిస్క్‌ను లెక్కచేయకుండా ప్రమాదకర విన్యాసాలు చేస్తుంటారు. సోషల్ మీడియాలో ఇలాంటి దృశ్యాలు చాలానే చూస్తుంటాం.. ఇప్పుడు కూడా అలాంటిదే మరో వీడియో వైరల్ అవుతోంది. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు కూడా వచ్చాయి. ఓ యువకుడు పుష్ అప్స్ చేస్తూ ఇప్పుడు విమర్శల పాలవుతున్నాడు. అతను పుష్ అప్స్ చేసింది గ్రౌండ్ మీద కాదు.. కదులుతున్న బైక్ మీద..! ఈ వెర్రి సాహసం చూసి షాక్ నెటిజన్లు అయ్యారు.

సమాచారం మేరకు బీహార్‌కు చెందిన ఈ వ్యక్తి ఈ ప్రమాదకరమైన మోటార్‌సైకిల్ స్టంట్ చేశాడు. అతడిని నీరజ్ యాదవ్‌గా గుర్తించారు. అతని ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఇలాంటి స్టంట్ వీడియోలు చాలానే ఉన్నాయి. వైరల్ అవుతున్న క్లిప్‌లో అతను కదులుతున్న బైక్‌పై పుష్ అప్స్ చేస్తూ కనిపించాడు. ఎలాంటి భయం లేకుండా పుష్‌అప్‌లు చేస్తున్న దృశ్యం చూస్తే మనకే ఒళ్లంతా వణుకుపుడుతోందంటూ నెటిజన్లు వాపోతున్నారు.

ఇవి కూడా చదవండి

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా అకౌంట్లలో హల్ చల్ చేస్తోంది. అతని ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొంతమంది ఈ సాహసాన్ని ప్రశంసించారు. చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అయితే ఇతర సోషల్ మీడియా ఖాతాల్లో ఈ వీడియోపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ప్రమాదకరమైన స్టంట్‌ చేసిన యువకుడిపై చర్యలు తీసుకోవాలని ఎక్స్‌ అకౌంట్‌లో పలువురు డిమాండ్‌ చేస్తున్నారు. దీనిపై స్పందించిన పోలీసులు అతడిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.

నీరజ్‌పై విమర్శలు రావడం ఇది తొలిసారి కాదు. రెండు నెలల క్రితం హసన్‌పూర్ పోలీసులు అతడి బైక్‌ను స్వాధీనం చేసుకున్నారని సమాచారం. అయితే, అతను ప్రమాదకరమైన వీడియోలను అప్‌లోడ్ చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు మరిన్ని విమర్శలను ఎదుర్కొంటున్నాడు. X ఖాతాలో అతనికి సంబంధించిన మరో వీడియోను షేర్ చేయడం ద్వారా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..