Viral Video: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని వీడియోలు నేటి పరిస్థితికి సామాన్యుడి దుస్థితికి అద్దం పడుతుంటాయి. అలాంటి ఓ వీడియో ఒకటి నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఎందుకంటే ఒక బైక్ మీద ఒకరు కాదు ఇద్దరు కాదు.. పిల్లలు, పెద్దలు కలిసి మొత్తం ఏడుగురు ప్రయాణిస్తున్నారు. దీంతో రోజు రోజుకి పెరుగుతున్న పెట్రోలు, నిత్యావసరాల ధరలు సామాన్యుడిపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఈ క్రమంలో ధరల భారం తట్టుకోలేక వారు తీసుకునే నిర్ణయాలు తీవ్రంగానే ఉంటున్నాయని కామెంట్ చేస్తున్నారు. అంతేకాదు అందుకు ఉదాహరణే ఈ వీడియో అంటూ తెగ షేర్ చేస్తున్నారు. ప్రస్తుతం తెగ వైరల్ వీడియో చూసిన నెటిజన్లు పలురకాలుగా స్పందిస్తున్నారు. ఏది ఏమైనా ఇలాంటి నిర్ణయం సరికాదంటున్నారు.
వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ వ్యక్తి తన ఫ్యామిలీతో కలిసి ఎక్కడికో బయలుదేరాడు. అయితే అక్కడ రెండు ఫ్యామిలీలు కనిపిస్తున్నాయి. ఇద్దరు మహిళలు, వారితోపాటు నలుగురు చిన్న పిల్లలు ఉన్నారు. వీరంతా కలిసి ఒకే బైక్‌పై ప్రయాణానికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలో బైక్ ముందు భాగంలో ఇద్దరు చిన్నారులను కూర్చో బెట్టారు. బండి నడిపే వ్యక్తి.. వెనుక మొదట ఒక మహిళ కూర్చుని ఉంది..వెంటనే ఆ మహిళకు మరోవైపు ఒక చిన్నారిని అందజేసింది.. ఆ వెనుక తాను బండిమీద ఒక చిన్నారిని తీసుకుని ఒడిలో పెట్టుకునుని కూర్చుంది.
ఇలా అందరూ బండి మీద అంటే మోటార్ బైక్ ముందు ఇద్దరు పిల్లలు. బండి నడిపే వ్యక్తి.. వెనుక ఇద్దరు మహిళలు, వారి ఒడిలో ఇద్దరు చిన్నారు.. అలా ఒకే బైక్ పైన ఏడుగురు ప్రయాణిస్తున్నారు. ఇది బైక్ కాదు..ఓ చిన్న సైజ్ ఆటోరిక్షా అంటూ కామెంట్ చేస్తూనే.. ఒకే బైక్‌పై అంతమంది ప్రయాణించడం ప్రమాదమని చెబితే.. పెట్రోలు ధరలు మండిపోతున్నాయి… అంత దూరం మళ్లీ మళ్లీ తిరగాలంటే చాలా ఖర్చవుతుంది.. అందుకే ఇలా వెళ్తున్నారెమో అంటూ కామెంట్ చేస్తున్నారు. ఏది ఏమైనా ఇలా రిక్స్ తీసుకుని ప్రయాణాలు చేస్తూ.. చేజేతులా ప్రమాదాలు కొనితెచ్చుకుంటున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..