Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: వామ్మో.. ఇంట్లోనే తిష్టవేసిన భారీ కింగ్ కోబ్రా.. పడగ విప్పి, బుసలు కొడుతూ.. షాకింగ్ వీడియో..

తాజాగా.. ఓ కింగ్ కోబ్రాకు సంబంధించిన కొత్త వీడియో వైరల్ అవుతోంది. అందులో కింగ్ కోబ్రా ఒక ఇంటి లోపల తిష్టవేసింది. నాగుపాము ఇంట్లో పడగ విప్పి బుసలు కొడుతుండగా.. ఒక వ్యక్తి దానిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు.

Viral Video: వామ్మో.. ఇంట్లోనే తిష్టవేసిన భారీ కింగ్ కోబ్రా.. పడగ విప్పి, బుసలు కొడుతూ.. షాకింగ్ వీడియో..
King Cobra
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jun 20, 2022 | 6:45 AM

King Cobra Viral Video: పాముల ప్రమాదకర వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం వైరల్ అవుతూనే ఉంటాయి. ముఖ్యంగా అత్యంత ప్రమాదకరమైన పాము.. కింగ్ కోబ్రా. దీనికి సంబంధించిన వీడియోలు తరచూ వైరల్ అవుతుంటాయి. సాధారణంగా చాలామంది పాము పేరు వినగానే భయపడతారు. దగ్గరగా చూస్తే పరిస్థితి ఎలా ఉంటుందో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా.. ఓ కింగ్ కోబ్రాకు సంబంధించిన కొత్త వీడియో వైరల్ అవుతోంది. అందులో కింగ్ కోబ్రా ఒక ఇంటి లోపల తిష్టవేసింది. నాగుపాము ఇంట్లో పడగ విప్పి బుసలు కొడుతుండగా.. ఒక వ్యక్తి దానిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. అయితే తర్వాతి వీడియోలో ఏం జరిగిందో చూస్తే మీరు కూడా భయపడతారు.

వైరల్ అవుతున్న వీడియోలో.. కింగ్ కోబ్రా ఇంట్లో పడగ విప్పి బుసలు కొడుతోంది. ఈ క్రమంలో ఓ వ్యక్తి దానిని పట్టుకోవడానికి వెళ్ళాడు. అతన్ని చూసిన వెంటనే అది బుసలు కొడుతూ మరింత రెచ్చిపోయింది. కింగ్ కోబ్రాను చూస్తే చాలా భయంకరంగా కనిపిస్తోంది. ఈ క్రమంలో కింగ్ కోబ్రా.. ఆ వ్యక్తి ప్లాస్టిక్ డబ్బాతో దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. దానిని చూస్తుంటే ఆ వ్యక్తికి కూడా భయమేస్తుందని తెలుస్తుంది. కొంత సమయం పాటు ప్రయత్నించిన తర్వాత ఆ వ్యక్తి డబ్బాలో తాచుపామును బంధిస్తాడు. ఈ సమయంలో పాము దాని నుంచి బయటకు వచ్చేందుకు కసరత్తులు చేస్తోంది. ఇది చూసి అందరూ భయపడుతున్నారు.

ఇవి కూడా చదవండి

వైరల్ వీడియో..

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో rasal_viper అనే యూజర్ షేర్ చేయగా.. వేలాది మంది వీక్షించారు. దీంతోపాటు 3 వేలకు పైగా నెటిజన్లు లైక్‌ చేశారు. అంతేకాకుండా వామ్మో ఈ పాము యమ డెంజర్.. చాలా జాగ్రత్తగా ఉండాలంటూ కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..