Viral Video: క్వార్టర్‌ అంటే ఎంత.? లెక్చరర్‌ అడిగిన ప్రశ్నకు విద్యార్థి ఇచ్చిన సమాధానం వింటే నవ్వు ఆపుకోలేరు..

|

Oct 09, 2021 | 3:36 PM

Viral Video: కరోనా పుణ్యామాని అన్ని రంగాలపై గట్టి దెబ్బ పడింది. ఇలా ప్రతికూలత ఎదుర్కొన్న రంగాల్లో విద్యా రంగం ఒకటి. లాక్‌డౌన్‌తో విద్యా సంస్థలు మూతపడడం వల్ల చాలా వరకు ఆన్‌లైన్‌ క్లాసెస్‌తోనే నెట్టుకొస్తున్నారు. అయితే...

Viral Video: క్వార్టర్‌ అంటే ఎంత.? లెక్చరర్‌ అడిగిన ప్రశ్నకు విద్యార్థి ఇచ్చిన సమాధానం వింటే నవ్వు ఆపుకోలేరు..
Viral Video
Follow us on

Viral Video: కరోనా పుణ్యామాని అన్ని రంగాలపై గట్టి దెబ్బ పడింది. ఇలా ప్రతికూలత ఎదుర్కొన్న రంగాల్లో విద్యా రంగం ఒకటి. లాక్‌డౌన్‌తో విద్యా సంస్థలు మూతపడడం వల్ల చాలా వరకు ఆన్‌లైన్‌ క్లాసెస్‌తోనే నెట్టుకొస్తున్నారు. అయితే ఆన్‌లైన్‌ క్లాసుల వల్ల విద్యార్థులపై తీవ్ర దుష్ప్రభావం పడిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. సరైన ఏకాగ్రత లేకపోవడం, అందరికీ ఆన్‌లైన్‌పై అవగాహన లేకపోవడం వెరసి విద్యార్థులు చదువులు గాడితప్పాయి. ఇక ఆన్‌లైన్‌ క్లాసులు జరుగుతోన్న సమయంలో జరుగుతోన్న కొన్ని ఫన్నీ సంఘటనలు ఇటీవల సోషల్‌ మీడియాలో హల్చల్‌ చేస్తున్నాయి. తాజాగా అలాంటి ఓ వీడియోనే నవ్వులు పూయిస్తోంది.

వివరాల్లోకి వెళితే.. సీఏ విద్యార్థులకు ఆన్‌లైన్‌లో క్లాస్‌ జరుగుతోంది. ఈ సందర్భంగా ఉపాధ్యాయుడు ప్రశ్నోత్తరాల్లో భాగంగా విద్యార్థులను ‘క్వార్టర్‌ అంటే ఏంటి.?’ అని ప్రశ్నించాడు. సాధారణంగా ఈ ప్రశ్నకు గణిత పరిభాషలో ఏమని సమాధానం చెబుతాం.. 25 శాతం లేదా 1/4, అదీ కాదంటే ఏడాదిలో మూడు నెలల సమయాన్ని క్వార్టర్‌గా పిలుస్తాం అని సమాధానం ఇస్తాం కదా.! అయితే ఓ విద్యార్థి ఇచ్చిన సమాధానం వింటే మాత్రం దిమ్మ తిరిగి పోవాల్సిందే.

ఉపాధ్యాయుడు హిత్విక్‌ అనే విద్యార్థిని ఈ ప్రశ్న అడగ్గానే అతను.. ’30 ఎమ్‌ఎల్‌’ అని సమాధానం ఇచ్చాడు. దీంతో ఒక్కసారి కోపానికి గురైన ఆ లెక్చరర్‌.. ‘అరే ఓ క్వార్టక్‌ కాదు..’ అంటూ బిగ్గరగా అరిచాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన కొందరు నెటిజన్లు ఆన్‌లైన్‌ చదువులు ఇలాగే ఉంటాయని కామెంట్లు చేస్తున్నారు.

Also Read: MAA Elections 2021: బజారున పడి నవ్వుల పాలవుతున్నారు.. మా ఎలక్షన్స్ పై మోహన్ బాబు సంచలన కామెంట్స్..

Hyderabad Rains: హైదరాబాద్‌కు హైఅలెర్ట్.. మరికొద్ది గంటల్లో భారీ వర్షాలు!

Car Insurance Add On: కారు కొన్నారా? ఇన్సూరెన్స్ చేయించారా? యాడ్-ఆన్స్ తీసుకోలేదు కదూ.. అవి చాలా ముఖ్యం ఎందుకంటే..