అంత చిన్న వయసులో ఏం కష్టం వచ్చిందో.. నెత్తి బాదుకుంటున్న చిన్నారి.. క్యూట్ వీడియో మీ కోసం..
చిన్నారులు.. చాలా ముద్దుగా అందంగా ఉంటారు. వారు చేసే చిన్నచిన్న పనులు ఎంతో ముచ్చట కలిగిస్తుంటాయి. ఎందుకంటే వారికి దురాశ, కోపం, అహంకారం, నిజాయతీ, అబద్ధాలు వంటివి వారికి తెలియవు. ఇంటర్నెట్ లో పిల్లలకు సంబంధించిన...

చిన్నారులు.. చాలా ముద్దుగా అందంగా ఉంటారు. వారు చేసే చిన్నచిన్న పనులు ఎంతో ముచ్చట కలిగిస్తుంటాయి. ఎందుకంటే వారికి దురాశ, కోపం, అహంకారం, నిజాయతీ, అబద్ధాలు వంటివి వారికి తెలియవు. ఇంటర్నెట్ లో పిల్లలకు సంబంధించిన వీడియోలు చాలా ఉన్నాయి. వారు నవ్వుతున్నప్పుడు మనకు తెలియకుండానే మన ముఖంలోనూ చిరునవ్వు వస్తుంది. ఇక ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే వారి అల్లరిని భరించడం చాలా కష్టం. ఇల్లు పీకి పందిరేస్తుంటారు గడుగ్గాయిలు. వారిని ఆపడం తల్లిదండ్రులకు ఓ పెద్ద ప్రయాస. వీటన్నింటిని పక్కన పెడితే.. కల్మషం లేని మనసుతో వారు చేసే పనులు ఉద్వేగం కలిగిస్తుంటారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో అలాంటి వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఇది చూశాక మీ పెదాలపై కచ్చితంగా చిరునవ్వు వస్తుంది.
వైరల్ అవుతున్న వీడియోలో.. ఒక చిన్న పిల్లవాడు తన నోటిలో బొమ్మను పెట్టుకోవడాన్ని చూడవచ్చు. అయితే.. తాను ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నట్లు తలపై తన చేతులతో కొట్టుకోవడం స్టార్ట్ చేశాడు. టెన్షన్ పడుతున్నట్టుగా పదే పదే అలా చేశాడు. అతని పరిస్థితి చూస్తే.. ఇంత చిన్న వయసులోనూ అంత కష్టం ఏమొచ్చిందా అనే డౌట్ రాక మానదు. ఈ తతంగాన్నంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. ఇది క్షణాల్లో వైరల్ గా మారింది.




me trying to switch off the overthinking pic.twitter.com/nezEjyJJQ1
— Invis? (@invis4yo) December 30, 2022
వైరల్ అవుతున్న ఈ వీడియో ప్రముఖ సోషల్ మీడియా మాధ్యమం ట్విట్టర్ లో పోస్ట్ అయింది. ఈ వీడియోకు ఇప్పటివరకు 10 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. అంతే కాకుండా క్లిప్ చూసిన తర్వాత.. నెటిజన్లు తమ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో రాస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి