Whiskey With Green Crab: తినే ఆహారపదార్ధాల పైనే కాదు.. మద్యంలో కూడా అనేక రకాల పదార్ధాలతో తయారు చేస్తూ మార్కెట్లోకి తీసుకున్నాయి కొన్ని సంస్థలు.. తాజాగా టామ్‌వర్త్ డిస్టిలింగ్ అనే సంస్థ విస్కీని అసాధారణమైన పదార్ధం నుండి తయారు చేస్తోంది. ఇన్వాసివ్ క్రాబ్ జాతి కి చెందిన గ్రీన్ క్రాబ్స్ తో విస్కీని తయారుచేస్తోంది. పీతల విస్కీ “కస్టమ్ క్రాబ్, మొక్కజొన్న, మసాలా మిశ్రమంతో నిండిన బోర్బన్ బేస్ తో తయారు చేస్తోంది.
టామ్‌వర్త్ డిస్టిలింగ్ యజమాని స్టీవెన్ గ్రాస్.. ఈ క్లా-సమ్ విస్కీని తయారు చేయడం గురించి తెలిజేశారు. విస్కీ డెవలపర్లు 40 కిలోల కంటే ఎక్కువ చిన్న పీతలను “క్రాబ్ స్టాక్”గా ఉడకబెట్టారని.. అనంతరం దానిని అంతర్గత తటస్థ ఆల్కహాల్ ఉపయోగించి రోటరీ వాక్యూమ్‌లో తయారు చేశారని చెప్పాడు.
టామ్‌వర్త్ డిస్టిల్లింగ్ క్రాబ్ విస్కీని ఎందుకు తయారు చేస్తోందంటే..?
యూరోపియన్ గ్రీన్ క్రాబ్ అనేది క్రస్టేసియన్ ఆక్రమణ జాతి. ఈ పచ్చ పీతలు ఈశాన్య అమెరికాలోని, న్యూ ఇంగ్లాండ్ ప్రాంతం తీర పర్యావరణ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తోంది. మరోవైపు ఆందోళన కలిగే విధంగా పచ్చ పీతల సంఖ్య పెరిపోతోంది. దీంతో ఈ పచ్చ పీతల సంఖ్యను అదుపులో ఉంచడానికి.. టామ్‌వర్త్ డిస్టిల్లింగ్ NH గ్రీన్ క్రాబ్ ప్రాజెక్ట్‌తో జతకట్టింది.
ఈ పచ్చ పీతలవలన పర్యావరణానికి కలిగిస్తున్న ముప్పుని తొలగించి.. స్థానికులకు ప్రయోజనం కలిగించేలా.. వ్యాపార అంశంగా మార్చడానికి డెకాపాడ్‌ల ప్రవర్తన సంస్థ పరిశోధిస్తోంది. తాజాగా ఈ పీత పానీయాలలో “సీక్రెట్” పదార్ధాన్ని జోడించి.. న్యూ హాంప్‌షైర్ ఆధారిత డ్రింక్ తయారు చేస్తోంది.
తాము సృజనాత్మకత ఆహ్లాదకరంగా, ఆసక్తికరంగా ఉండే విధంగా సమస్యపై ప్రజలకు అవగాహన పెంచుతున్నామని.. సృజనాత్మకత, ఉత్తేజంతో తాము ఇబ్బందికరమైన సముద్ర జీవులను రుచికరమైన ట్రీట్‌గా మార్చగలమనడానికి ఇది ఒక రుజువని ” అని స్టీవెన్ చెప్పారు. “పాక కళలలో ప్రయోగాలు చేసే ధైర్యవంతులైన వ్యక్తులు మరింత మంది ముందుకురావాలని.. సవాళ్లను ఎదుర్కొంటూ .. కెరీర్లో ఎదగాలని తాము మేము కోరుకుంటున్నామని పేర్కొన్నారు. అంతేకాదు.. ఈ పచ్చ పీతలను తినడం ద్వారా ప్రకృతి శత్రువుని ఓడించండిని ప్రజలకు పిలుపునిచ్చారు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..