Photo Puzzle: దొంగి.. ముద్దైన కుందేలు ఈ ఫోటోలో దాగి ఉంది.. 20 సెకన్లలో కనిపెట్టగలరా..?
Find Rabbit In Photo: ఫోటో పజిల్స్‌ను ఈ మధ్య చాలామంది ఇష్టపడుతున్నారు. ఫోటో పజిల్స్ మన మెదడును చురుగ్గా చేయడమే కాదు.. మన ఐ పవర్ ఏ స్థాయిలో ఉందో కూడా చెప్పేస్తాయి. తాజాగా మీ కోసం ఓ క్రేజీ ఫజిల్...
Challenging Quiz: డియర్ పజిల్ లవర్స్.. ఈ రోజు మీ కోసం ఓ క్రేజీ పజిల్‌తో మీ ముందుకు వచ్చాం. కచ్చితంగా.. ఈ పజిల్ మిమ్మల్ని పక్కాగా ఆకట్టుకుంటుంది. మీ ఐ పవర్ ఏ రేంజ్‌లో ఉందో చెప్పేస్తుంది. ఒకవేళ మీరు పజిల్ సాల్వ్ చేయలేకపోతే.. ఆన్సర్ ఉన్న ఫోటో చూశాక.. అరెరె అక్కడే ఉన్నా కనిపెట్టలేకపోయాం అనిపిస్తుంది. రోజూ లెక్కబెట్టలేనన్ని ఫోటోలు క్లిక్ అవుతున్నాయి. మొబైల్స్‌లో కెమెరాలు వచ్చాక.. చాలామంది ప్రతి మూమెంట్ ఓ జ్ఞాపకంగా మార్చుకుంటున్నారు. అయితే కొన్ని ఫోటోలు చాలా ప్రత్యేకంగా అనిపిస్తాయి. మేం క్లవర్స్ అనుకునే వాళ్లను పరీక్ష పెడతాయి. ఆ కేటగిరీకి చెందినవే ఆప్టికల్ ఇల్యూషన్(Optical illusion) ఫోటోస్. తాజాగా అలాంటి ఫోటోనే మీ ముందుకు తెచ్చాం. ఇది ఓ మైదాన ప్రాంతంలో తీసినదిగా అర్థమవుతుంది. ఈ ఫోటోలో ఓ కుందేలు(Rabbit) ఉంది. దాన్ని కనిపెట్టడం అంత సులువు అంత సులవు కాదు సుమీ. మీ ఐ పవర్ సూపర్‌గా ఉంటే తక్కువ సమయంలోనే ఆ కుందేలును కనిపెట్టవచ్చు. ఇంకెందుకు ఆలస్యం బాగా గమనించింది. ఫోకస్ పెట్టి చూస్తే .. దాన్ని తక్కువ సమయంలోనే పట్టేయవచ్చు. ఏదో నామ్ కే వాస్త్ చూస్తే మాత్రం అది దొరకదు. ఎంత చూసినా మాకు చిక్కడం లేదు.. కష్టం బాబోయ్ అనిపిస్తే దిగువన ఫోటో చూడండి.
చూశారుగా… ఇప్పుడు అనిపిస్తుంది కదా.. చా.. అక్కడే ఉన్నా కనిపెట్టలేకపోయాం అని.. అందుకే కాస్త ఓపికతో చూడమన్నది. మీరే కాదు.. నూటికి 70 శాతం మంది ఈ కుందేలును కనిపెట్టడంలో విఫలమయ్యారు. ఈ సారి ఫోటో పజిల్ ఇచ్చినప్పుడు మాత్రం కాస్త దృష్టి పెట్టి చూడండి. మీరు పక్కా విన్ అవుతారు.