Viral News: సౌదీ అరేబియాలో బయటపడిన 8000 ఏళ్ల నాటి దేవాలయం.. అంతుచిక్కని రహస్యాలు ఎన్నో..

|

Aug 11, 2022 | 10:03 PM

ఆ దేశ పురావస్తు శాఖ శాస్త్రజ్ఞుల బృందం కొత్త సాంకేతికత సహయంతో మతపరమైన కేంద్రాన్ని వెలికితీసింది. ఆల్ఫా సైట్‏లో పరిశోధన కోసం ఇంకా చాలా అవశేషాలు కనుగొన్నారు.

Viral News: సౌదీ అరేబియాలో బయటపడిన 8000 ఏళ్ల నాటి దేవాలయం.. అంతుచిక్కని రహస్యాలు ఎన్నో..
Viral News
Follow us on

సౌదీ అరేబియాలో 8000లో సంవత్సరాల పురాతన ఆలయం బయటపడింది. ఆలయ అవశేషాలు ఉన్న ప్రాంతాన్ని ఆ దేశపు పురావస్తు శాఖ కనుగొంది. ఆ పురాతన ఆలయానికి సంబంధించిన అవశేషాలకు సంబంధించిన ఫోటోలను పురావస్తు శాఖ సోషల్ మీడియాలో షేర్ చేయగా తెగ వైరల్ అవుతున్నాయి. సౌదీ ప్రెమ్ ఏజెన్సీ నివేదిక ప్రకారం.. సౌదీ అరేబియా రాజధాని అయిన రియాద్‎కు నైరుతి దిశలో ఉన్న ఆల్ఫాలో 8000 సంవత్సరాల నాటి పురాతన ఆలయం కనుగొనబడింది. ఒక్కప్పడు అక్కడ ఆల్ఫా ప్రజలు పూజలు చేసేందుకు ఈ ఆలయానికి వచ్చేవారని తెలుస్తోంది.

ఆ దేశ పురావస్తు శాఖ శాస్త్రజ్ఞుల బృందం కొత్త సాంకేతికత సహయంతో మతపరమైన కేంద్రాన్ని వెలికితీసింది. ఆల్ఫా సైట్‏లో పరిశోధన కోసం ఇంకా చాలా అవశేషాలు కనుగొన్నారు. ఆ ఆధారాన్నింటిని పరిశోధనకు పంపారు. సౌదీ గెజిట్ ప్రకారం.. ఆల్ఫాలోని ఈ ముఖ్యమైన ప్రాంతం గత 40 సంవత్సరాలుగా పురావస్తు శాఖ ప్రజలకు హాట్ స్పాట్ గా ఉంటుంది. ఆ ప్రాంత ప్రజలు ఎక్కువగా పూజలు చేసేవారని.. ఆలయాలు ఎక్కువగా ఉండేవని తెలుస్తోంది. అలాగే నీరు కోసం కొత్త సాంకేతికతను అప్పటి ప్రజలు ఉపయోగించేవారని… రోజూవారీ జీవితంలో ఎలాంటి పనులు చేసేవారని.. వారి జీవనశైలీ ఎలా ఉండేది అనే విషయాలపై నిపుణలు పరిశోదనలు చేస్తున్నారు. ఇప్పటికే ఆల్ఫా ప్రజలకు సంబంధించిన జీవనశైలీ.. వారి ప్రాంత సమాచారం నిపుణులకు అంతుచిక్కని రహస్యంగా మిగిలిపోయింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.