చాలా మంది పిల్లలకు చదువుపై ఆసక్తి ఉండదు. కొందరు పిల్లలు మాత్రం తల్లిదండ్రులకు భయపడి అయిష్టంగా చదువుకుంటే, మరికొందరు స్నేహితులను మించిపోయేలా చదువుకుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులు ఇష్టం లేకపోయినా వారిని నెట్టాల్సి వస్తోంది. కానీ పిల్లలను కొంత వరకు తిట్టడం, మందలించడం సరైనదే. ఎందుకంటే ఎక్కడ ప్రేమ, గారాబం ఎక్కువైతే అన్ని సమస్యలూ అక్కడి నుంచే మొదలవుతాయి. చాలా సార్లు తెలిసి తెలియక తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తమ పిల్లలను తక్కువ మార్కులు వచ్చాయని, హోంవర్క్ పూర్తి చేయకపోవడం వంటి అనేక కారణాలతో తిడుతుంటారు. కొట్టడం వంటివి కూడా చేస్తుంటారు.
కానీ పిల్లవాడు చదువుపై ఎందుకు ఆసక్తి చూపడం లేదో అర్థం చేసుకోవడానికి ఎప్పుడూ ప్రేమగా ప్రయత్నించలేరు..? పిల్లాడు చదువు మానేసి ఎందుకు పారిపోతున్నాడు..? దీని కారణం ఏంటీ.? ఎప్పుడూ ఎందుకు చిరాకుగా ఉంటాడు.. అన్నదానిపై దృష్టి పెట్టరు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఇచ్చిన పనిష్మెంట్ తర్వాత కొందరు పిల్లలు మౌనంగా ఉండిపోతే, మరికొందరు పిల్లలు మొండి వైఖరి, పెద్దల పట్ల అగౌరవంగా తయారవుతుంటారు.
ఇది కాకుండా, కొంతమంది పిల్లలు దూకుడు స్వభావం కలిగి ఉంటారు. అలాంటి వారు తల్లితండ్రులు తిట్టడం, కొట్టడం ఇష్టం లేని పసి హృదయాల్లో పగ తీర్చుకోవాలనే తపన కలుగుతుంది. అలాంటి సంఘటనే ఇది కూడా.. తన తండ్రి తనను కొట్టాడని ఆరోపించిన చైనాకు చెందిన 7 ఏళ్ల చిన్నారికి ఇలాంటిదే జరిగింది. చైనాకు చెందిన ఓ వార్త పత్రిక రాసిన కథనం మేరకు.. చైనాలోని జెన్‌జియాంగ్ ప్రావిన్స్‌కు చెందిన లిషుయ్ అనే చిన్నారి తన తండ్రి తనను కొట్టాడని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు విచారించగా విషయం వేరేగా తేలింది. హోంవర్క్‌కు భయపడి చిన్నారి ఇలా చేశాడని పోలీసులు నిర్ధారించారు. ఆ తర్వాత పోలీసులు ఉదారత చూపి విషయం ముందుకు తీసుకెళ్లకుండా చిన్నారితో మాట్లాడి ప్రేమగా వివరించారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..