Viral Video: ఇదో సంచార మద్యం దుకాణం.. స్కూటీలో దాచిన లిక్కర్‌ బాటిళ్లు చూస్తే మతిపోవాల్సిందే..!

ఈక్రమంలోనే కొందరు యువకులు బైక్‌ డిక్కీలో దాచుకుని వెళ్తున్న మద్యం సీసాలను ఎక్సైజ్‌ అధికారుల సీజ్‌ చేశారు. స్కూటర్‌ డిక్కీలో వందల సంఖ్యలో మందుసీసాలు పట్టుబడటం చూసిన అధికారులే కంగుతిన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇంటర్‌ నెట్‌లో వైరల్‌ అవుతోంది. దాదాపు 22 సెకన్ల నిడివి గల ఆ చిన్న క్లిప్‌ X లో పోస్ట్ చేశారు. @askbhupi అనే యూజర్ పోస్ట్‌ చేసిన ఈ వీడియోకి క్యాప్షన్‌ ఇలా రాశారు..

Viral Video: ఇదో సంచార మద్యం దుకాణం.. స్కూటీలో దాచిన లిక్కర్‌ బాటిళ్లు చూస్తే మతిపోవాల్సిందే..!
Liquor Quarter

Updated on: May 24, 2025 | 9:47 PM

మద్యపానం నిషేధించబడిన రాష్ట్రాల్లో ప్రజలు మద్యం అక్రమంగా రవాణా చేయడానికి వివిధ ఉపాయాలు ప్రయత్నిస్తారు. అలాంటిదే ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రంలో కొన్ని చోట్ల మాత్రమే మద్యం దుకాణాలు మూసివేయబడ్డాయి. దీంతో అక్కడి ప్రజలు విభిన్న రీతుల్లో మద్యం అక్రమ రవాణా సాగిస్తున్నారు. ఈక్రమంలోనే కొందరు యువకులు బైక్‌ డిక్కీలో దాచుకుని వెళ్తున్న మద్యం సీసాలను ఎక్సైజ్‌ అధికారుల సీజ్‌ చేశారు. స్కూటర్‌ డిక్కీలో వందల సంఖ్యలో మందుసీసాలు పట్టుబడటం చూసిన అధికారులే కంగుతిన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇంటర్‌ నెట్‌లో వైరల్‌ అవుతోంది.

వైరల్‌ వీడియోలో ఇద్దరు అబ్బాయిలు స్కూటర్ డిక్కీలో,ముందు చిన్న బాక్స్‌ వంటి ప్రదేశంలో కూడా మద్యం సీసాలు నింపుకుని వెళ్తున్నారు. వారి సెటప్‌ చూస్తుంటే.. ఇదేదో సంచార మద్యం దుకాణంలా కనిపించింది. విషయం పసిగట్టిన అధికారులు వారిని అడ్డుకుని బైక్‌లో దాచిన మద్యం సీసాలను స్వాదీనం చేసుకున్నారు. ఈ వీడియోలో ఎక్సైజ్ అధికారి స్కూటీ డిక్కీలోంచి మద్యం బాటిళ్లను బయటకు తీయటం స్పష్టంగా చూడవచ్చు. ఈ సంఘటన ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీకి చెందినదిగా తెలిసింది. 50 మద్యం క్వార్టర్లు, 5 హాఫ్ బాటిళ్లను స్కూటీ డిక్కీలో దాచి తీసుకున్నట్టుగా అధికారులు వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

వీడియో ఇక్కడ చూడండి..

దాదాపు 22 సెకన్ల నిడివి గల ఆ చిన్న క్లిప్‌ X లో పోస్ట్ చేశారు. @askbhupi అనే యూజర్ పోస్ట్‌ చేసిన ఈ వీడియోకి క్యాప్షన్‌ ఇలా రాశారు.. హల్ద్వానీలో ఒక ధైర్యవంతుడైన యువకుడు తన స్కూటర్‌ను మినీ-బార్‌గా మార్చుకున్నాడు! అందులో 50 మద్యం క్వార్టర్లు, 5 హాఫ్ బాటిళ్లను దాచి ఉంచి ఇదో సంచార మద్యం దుకాణంలా మార్చేశారంటూ రాశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..