పనిచేసే ప్రదేశాల్లో డ్యాన్స్ చేయడం, టిక్ టాక్ లు వీడియోలు చేసి పలువురు తమ ఉద్యోగాలు కోల్పోవడం, లేదా కొన్నిరోజులు సస్పెన్షన్ కు గురైన సంఘటనలను చాలా చూశాం. ఈక్రమంలో కదులుతున్న కారులో సరదాగా డ్యాన్స్ చేశారు ముగ్గురు పోలీసులు . వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కొద్ది క్షణాల్లోనే ఈ పోలీసులు సెలబ్రిటీలుగా మారిపోయారు. అంతా బాగుంది అనుకున్న తరుణంలో ఆ పోలీసులకు ఊహించని షాక్ ఇచ్చారు ఉన్నతాధికారులు. ఆ ముగ్గురు పోలీసులను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. కారులో సరదాగా డ్యాన్స్ చేసిందానికే సస్పెండ్ చేస్తారా? అని చాలామంది అడగవచ్చు. కానీ వారి సస్పెన్షన్ కు ఇంకో ప్రధాన కారణముంది.
పూర్తి వివరాల్లోకి వెళితే.. గుజరాత్‌లోని కచ్ జిల్లాకు చెందిన ముగ్గురు పోలీసులు కారులో ప్రయాణం చేస్తూ.. సరదాగా డ్యాన్స్ చేశారు. ఈ వీడియో కాస్త పోలీసు ఉన్నతాధికారుల వరకు చేరింది. కాగా డ్యాన్స్ చేస్తున్న సమయంలో ముగ్గురు పోలీసులు ముఖానికి మాస్క్ ధరించలేదు. సీటు బెల్ట్ కూడా పెట్టుకోలేదు. ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన పోలీసులే ఇలా కరోనా నిబంధనలను, ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించడంపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. అందుకే వారిపై సస్పెన్షన్ వేటు వేశారు.<
TOP 9 ET News : నీ సాయం మరువలేనిది.. | కోరిక తీరిస్తేనే సినిమా అవకాశం..(వీడియో)