విమానంలో ఆఫీసుకు వెళ్తున్న యువతి.. 2000 కి.మీ ప్రయాణం.. ఖర్చు తక్కువేనంటూ వివరణ..

|

Dec 01, 2023 | 7:25 PM

ఈ క్రమంలోనే సోఫియా ఆఫీసుకి వెళ్లేందుకు వారానికి ఒకసారి తెల్లవారుజామున 3.45 గంటలకు నిద్ర లేస్తుంది. తానే స్వయంగా విమానాశ్రయానికి వెళుతుంది. లేదంటే కొన్ని కొన్ని సందర్బాల్లో ఆమె తల్లిదండ్రులు కూడా ఆమెను ఎయిర్‌పోర్ట్‌ వద్ద డ్రాప్ చేస్తుంటారు. అలా ఆమె 6.30కి ఫ్లైట్ ఎక్కి విమానంలో కిటికీలోంచి సూర్యోదయాన్ని చూడటం తనకెంతో ఇష్టమని సోఫియా చెప్పింది. ఇక ఉదయం 8 గంటలకు

విమానంలో ఆఫీసుకు వెళ్తున్న యువతి.. 2000 కి.మీ ప్రయాణం.. ఖర్చు తక్కువేనంటూ వివరణ..
21 Year Old Intern
Follow us on

సాధారణంగా ప్రజలు బస్సు, లోకల్ ట్రైన్, మెట్రో, క్యాబ్ లేదా సొంత వాహనంలో ఆఫీసుకు వెళ్తారు. అయితే ఎవరైనా విమానంలో ఆఫీసుకు వెళతారని మీరు ఎప్పుడైనా విన్నారా? అవును మీరు విన్నది నిజమే..ఇక్కడో యువతి రోజూ విమానంలో బయల్దేరి ఆఫీసుకు వెళ్తుందనే విషయం వెలుగులోకి రావటంతో వైరల్‌గా మారింది. సౌత్ కరోలినాకు చెందిన సోఫియా సెలెంటానో అనే 22 ఏళ్ల అమ్మాయి.. తన ఆఫీసుకి దగ్గరలో ఒక ఇంటిని అద్దెకు తీసుకోకుండా.. తన డ్రీమ్‌ జాబ్‌ కోసం న్యూజెర్సీకి వెళ్లింది. ఇదంతా తనకు ఎంత చౌకగా ఉంటుందో సోఫియా వివరించింది.

తన డ్రీమ్‌ జాబ్‌ కోసం ఆ అమ్మాయి.. ఆఫీసుకు సమీపంలోని ఇంటిని అద్దెకు తీసుకోకుండా విమానంలో ఎలా ప్రయాణిస్తుందో ఆమె స్వయంగా వెల్లడించింది. ఆమె సౌత్ కరోలినా నుండి న్యూజెర్సీకి ఉద్యోగరీత్యా వెళుతుంది. వాస్తవానికి, సోఫియా టిక్‌టాక్‌లోని తన అనుచరులకు మొత్తం విషయాన్ని వివరించింది. సోఫియా ఒక కంపెనీలో ఇంటర్న్‌షిప్ చేయాల్సి వచ్చింది. కానీ ఆమె న్యూజెర్సీ వంటి ఖరీదైన ప్రదేశానికి మారడానికి భయపడింది. దాంతో తను పనిచేస్తున్న ఆఫీసుకు దూరం అయినా సరే.. తను ఉంటున్న స్థలం నుంచే ప్రతిరోజూ విమానంలో ఆఫీసుకు వెళ్తున్నానని చెప్పింది.

సోఫియా మాట్లాడుతూ- ‘తాను ఒక యాడ్ ఏజెన్సీలో 10 వారాల హైబ్రిడ్ సమ్మర్ ఇంటర్న్‌షిప్ చేస్తున్నట్టుగా వివరించింది. వారంలో ఒకరోజు న్యూజెర్సీలో ఆఫీసులో ఉండాలి. కాబట్టి, ఇంటి అద్దె, ఫ్లైట్ టికెట్ రేట్లు లెక్కపెట్టాక వారానికి ఒకరోజు ప్రయాణం తక్కువ ధర అని అర్థమైంది. ఇక దాంతో ఆమె తన ఆఫీసుకు దగ్గరగా ఇల్లు అద్దెకు తీసుకోకుండా, తను తన కుటుంబంతో కలిసి సౌత్ కరోలినాలోనే నివసిస్తున్నట్టుగా వివరించింది. ఇక ఆఫీసుకు వెళ్లేందుకు మాత్రం వారానికి ఒకరోజు విమానంలో ప్రయాణిస్తుంటానని వివరించింది.

ఇవి కూడా చదవండి

ఇక, ఈ క్రమంలోనే సోఫియా ఆఫీసుకి వెళ్లేందుకు వారానికి ఒకసారి తెల్లవారుజామున 3.45 గంటలకు నిద్ర లేస్తుంది. తానే స్వయంగా విమానాశ్రయానికి వెళుతుంది. లేదంటే కొన్ని కొన్ని సందర్బాల్లో ఆమె తల్లిదండ్రులు కూడా ఆమెను ఎయిర్‌పోర్ట్‌ వద్ద డ్రాప్ చేస్తుంటారు. అలా ఆమె 6.30కి ఫ్లైట్ ఎక్కి విమానంలో కిటికీలోంచి సూర్యోదయాన్ని చూడటం తనకెంతో ఇష్టమని సోఫియా చెప్పింది. ఇక ఉదయం 8 గంటలకు న్యూజెర్సీలో దిగిన తర్వాత, ఆమె తన కార్యాలయానికి 45 నిమిషాలు క్యాబ్‌లో ప్రయాణించి ఉదయం 9 గంటలకు ఆఫీస్‌కి చేరుకుంటానని చెప్పింది.

ఈ మేరకు మీడియాతో మాట్లాడుతూ.. సోఫియా తన విమానాలను మూడు నుండి నాలుగు వారాల ముందుగానే బుక్ చేసుకుంటానని వెల్లడించింది. తద్వారా తనకు టికెట్‌ చౌకగా లభిస్తుందని చెప్పింది. ఇక తనకు అప్‌డౌన్‌ ట్రిప్ ఫ్లైట్ ఒక రోజు ఖర్చు సుమారు $100, క్యాబ్ కోసం $100 చెల్లిస్తానని చెప్పింది.. కానీ, తను న్యూయార్క్ నగరంలో, లేదంటే న్యూజెర్సీలో నివసించాలంటే..తాను ఇంటి అద్దె కోసం ప్రతి నెలా వేల డాలర్లు ఖర్చు చేయాల్సి వస్తుందని చెప్పింది. అందుకే విమాన ప్రయాణం ఎంచుకున్నానని చెప్పింది. ఇక సోషల్ మీడియాలో వీడియో వైరల్‌ కావటంతో నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..