Viral Video: 200 కేజీల డార్క్‌ చాక్లెట్‌ గణపతి..! అద్భుతం ఈ ప్రతిమ.. సోషల్ మీడియాలో వైరల్‌..

Viral Video: దేశవ్యాప్తంగా ప్రజలందరు వినాయకచవితిని జరుపుకుంటున్నారు. ఇప్పటి నుంచి 9 రోజుల పాటు ఆయన సన్నిధిలోనే ఉంటారు. చిన్నా పెద్దా తేడా లేకుండా ప్రతి

Viral Video: 200 కేజీల డార్క్‌ చాక్లెట్‌ గణపతి..! అద్భుతం ఈ ప్రతిమ.. సోషల్ మీడియాలో వైరల్‌..
Chocolate Ganesh
Follow us
uppula Raju

|

Updated on: Sep 10, 2021 | 3:47 PM

Viral Video: దేశవ్యాప్తంగా ప్రజలందరు వినాయకచవితిని జరుపుకుంటున్నారు. ఇప్పటి నుంచి 9 రోజుల పాటు ఆయన సన్నిధిలోనే ఉంటారు. చిన్నా పెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఈ పండుగలో పాల్గొంటారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఎక్కడ చూసినా ఆయనే దర్శనమిస్తారు. కొంతమంది భక్తులు విభిన్న గణపతులను ప్రతిష్ఠిస్తారు. పండ్లు, పూలు, ఇతర ఆహారపదార్థాలతో వినాయకులను తయారుచేస్తారు. ఈ గణేశ్‌ ప్రతిమలు చూడముచ్చటగా, ఆకర్షణీయంగా ఉంటాయి. తాజాగా డార్క్‌ చాక్లెట్‌తో తయారుచేసిన గణేశ్ విగ్రహం ఒకటి సోషల్‌మీడియాలో హల్‌చల్‌ చేస్తుంది. విపరీతంగా వైరల్‌ అవుతోంది. ఆ గణేశ్‌డి ముచ్చట్లను ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

పంజాబ్‌ రాష్ట్రం లూథియానా నగరంలోని ఒక బేకరీలో చాక్లెట్‌తో తయారు చేసిన గణేష్ విగ్రహం ప్రజలను ఆకట్టుకుంటుంది. బేకరీ యజమాని కుక్రేజా మాట్లాడుతూ.. “మేము 6 సంవత్సరాలుగా చాక్లెట్ గణేష్ తయారు చేస్తున్నాము. వినాయక చవితిని పర్యావరణానికి హాని కలిగించకుండా జరుపుకోవాలని ప్రజలకు తెలియజేయడానికి ఇలా చేస్తున్నాం” అని చెప్పారు. హర్జీందర్ సింగ్ కుక్రేజా తన ఇన్‌స్టాగ్రామ్‌లో చాక్లెట్ గణేష్ విగ్రహం వీడియోను షేర్ చేశారు. అప్పటి నుంచి ఈ వీడియో వైరల్‌ అవుతోంది.

ఈ చాక్లెట్‌ వినాయకుడిని తయారు చేయడానికి పది రోజులు పట్టిందని కుక్రేజా చెప్పాడు. 10మంది చెఫ్‌లు 200 కిలోల కంటే ఎక్కువ బెల్జియన్ డార్క్ చాక్లెట్‌ను ఉపయోగించి ఈ ప్రతిమను సిద్ధం చేశామన్నారు. ఇది అంత సులభమైన పని కాదని, చిన్న మిస్టక్‌ జరిగినా మళ్లీ మొదటి నుంచి మొదలుపెట్టాలన్నారు. కానీ ఏదైనా చేయడానికి ఇష్టపడినప్పుడు సవాళ్లు కూడా సరదాగా మారుతాయని తెలిపాడు. ఈ విగ్రహాన్ని పాలలో నిమజ్జనం చేస్తామని తరువాత పిల్లలకు ప్రసాదంగా చాక్లెట్ పాలు పంపిణీ చేస్తామని వివరించాడు. ఈ వీడియో ఇప్పటివరకు 9 వేలకు పైగా మందికి నచ్చింది. ప్రజలు నిరంతరం తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. 200 కిలోల విగ్రహాన్ని చూసి చాలా మంది వినియోగదారులు ఆశ్చర్యపోతున్నారు. ప్రతిఒక్కరూ అద్భుతంగా ఉందని చెబుతున్నారు.

Vastu Tips: మీ పిల్లలు చదువులో వెనుకబడుతున్నారా..! అయితే స్టడీ రూం వాస్తు మార్చాల్సిందే..?

Ap Weather Report: బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం.. ఏపీలో పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు

Vinayaka chavithi: గణపతి పూజలో ఈ మొక్క ఉంటే చాలా డేంజర్.. ఎందుకో తెలుసా..