AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఓరీ దేవుడో.. 2 గంటల జర్నీలో..20 కి.మీ. భారీ ట్రాఫిక్ జామ్!

ఉత్తరాఖండ్‌లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కైంచీ ధామ్ సమీపంలో సుమారు 20 కిలోమీటర్ల మేర భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. బాలీవుడ్ చిత్రం హనుమాన్ అంశ ఎఫెక్ట్‌, ప్రముఖుల సందర్శన ప్రభావంతో పాటు నీమ్ కరోలీ బాబా ఆశ్రమానికి భక్తులు భారీగా తరలిరావడమే ఇందుకు కారణమని భావిస్తున్నారు. భోవాలి-అల్మోడా రహదారిపై వేలాది వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

ఓరీ దేవుడో.. 2 గంటల జర్నీలో..20 కి.మీ. భారీ ట్రాఫిక్ జామ్!
Kainchi Dham Traffic Jam
Jyothi Gadda
|

Updated on: Oct 07, 2026 | 7:46 PM

Share

ఉత్తరాఖండ్ నైనితాల్ జిల్లాలోని ప్రసిద్ధ ఆధ్యాత్మిక క్షేత్రం కైంచీ ధామ్ వద్ద ఊహించని రీతిలో భారీ ట్రాఫిక్ స్తంభించిపోయింది. నీమ్ కరోలీ బాబా ఆశ్రమ దర్శనం కోసం, ఇటీవల ప్రచారంలోకి వచ్చిన హనుమాన్ అంశ ప్రభావం వల్ల దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు, పర్యాటకులు ఒకేసారి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీంతో భోవాలి-అల్మోడా రహదారిపై ఏకంగా 20 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.

కైంచీ ధామ్‌కు వెళ్లే ప్రధాన రహదారులన్నీ పర్యాటకుల కార్లు, బస్సులు, ద్విచక్ర వాహనాలతో నిండిపోయాయి. గంటల తరబడి వాహనాలు అంగుళం కూడా ముందుకు కదలకుండా నిలిచిపోవడంతో పర్యాటకులు, చిన్న పిల్లలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కొండ ప్రాంతం కావడంతో ప్రత్యామ్నాయ మార్గాలు లేకపోవడం, ఇరుకైన రహదారులు ఉండటం వల్ల సమస్య మరింత తీవ్రరూపం దాల్చింది.

కైంచీ ధామ్ పీఠాధిపతి నీమ్ కరోలీ బాబాకు ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది భక్తులు ఉన్నారు. సెలవు రోజులు లేదా ప్రత్యేక సందర్భాలలో ఇక్కడికి భక్తుల రాక విపరీతంగా పెరుగుతుంది. ఇటీవల సోషల్ మీడియా ప్రచారం, చిత్రాల ప్రభావం, ప్రముఖుల సందర్శనల వార్తల వల్ల యువత, పర్యాటకులు కైంచీ ధామ్ వైపు ఆకర్షితులవుతున్నారు. కొండ ప్రాంతాలలో పెరిగే వాహనాల సంఖ్యకు తగ్గట్లుగా పార్కింగ్ ప్రదేశాలు లేకపోవడం వల్ల రహదారులపైనే వాహనాలు నిలపాల్సి వస్తోంది.

ఇవి కూడా చదవండి

ట్రాఫిక్ సమాచారం అందుకున్న వెంటనే నైనితాల్ జిల్లా పోలీసులు, స్థానిక యంత్రాంగం రంగంలోకి దిగాయి. వాహనాలను క్రమబద్ధీకరించడానికి, ప్రత్యామ్నాయ పాయింట్ల వద్ద నిలిపివేయడానికి పోలీసులు గంటల తరబడి శ్రమించారు. రద్దీని నియంత్రించేందుకు కైంచీ ధామ్ మార్గంలో భారీ వాహనాల ప్రవేశంపై తాత్కాలికంగా ఆంక్షలు విధించారు. కొండ ప్రాంతాలలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రాలకు వెళ్లే ముందు ప్రయాణికులు ముందస్తుగా ట్రాఫిక్ అప్‌డేట్స్ తెలుసుకోవాలని, యంత్రాంగం జారీ చేసే మార్గదర్శకాలను పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
ఇక రూ.6 వేలకే మీ ఇల్లు సినిమా థియేటర్.. స్పెషల్ ఆఫర్
ఇక రూ.6 వేలకే మీ ఇల్లు సినిమా థియేటర్.. స్పెషల్ ఆఫర్
ఓరీ దేవుడో.. 2 గంటల జర్నీలో..20 కి.మీ. భారీ ట్రాఫిక్ జామ్!
ఓరీ దేవుడో.. 2 గంటల జర్నీలో..20 కి.మీ. భారీ ట్రాఫిక్ జామ్!
అయ్యో పాపం.. జారుడుబండలో షర్టు ఇరుక్కుని 13 ఏళ్ల బాలుడు మృతి
అయ్యో పాపం.. జారుడుబండలో షర్టు ఇరుక్కుని 13 ఏళ్ల బాలుడు మృతి
వీరి కుటుంబాల్లో నెలంతా సుఖసంతోషాలే..! లిస్ట్‌లో మీ రాశి ఉందా?
వీరి కుటుంబాల్లో నెలంతా సుఖసంతోషాలే..! లిస్ట్‌లో మీ రాశి ఉందా?
సాక్స్‌లో బిర్యానీ ఆకు పెట్టుకుని పడుకుంటే ఏం జరుగుతుందో తెలుసా?
సాక్స్‌లో బిర్యానీ ఆకు పెట్టుకుని పడుకుంటే ఏం జరుగుతుందో తెలుసా?
జిమ్ జిమ్ తార పాటతో సినిమా ప్రమోషన్స్..
జిమ్ జిమ్ తార పాటతో సినిమా ప్రమోషన్స్..
2వ టీ20 నుంచి అతన్ని పీకేయాల్సిందే.. వైభవ్‌ తొలి మ్యాచ్‌కు రెడీ..
2వ టీ20 నుంచి అతన్ని పీకేయాల్సిందే.. వైభవ్‌ తొలి మ్యాచ్‌కు రెడీ..
దసరా వస్తుందని ఇదేం పనిరా.. ఎవర్రా మీరంతా.. అసలు ఏంచేశారో తెలిస్త
దసరా వస్తుందని ఇదేం పనిరా.. ఎవర్రా మీరంతా.. అసలు ఏంచేశారో తెలిస్త
కింగ్ నాగార్జున ఫోన్‌లో ఒక్క ఫొటో కూడా ఉండదు.. కారణమేంటో తెలుసా?
కింగ్ నాగార్జున ఫోన్‌లో ఒక్క ఫొటో కూడా ఉండదు.. కారణమేంటో తెలుసా?
దసరా పండుగకు 7 వేల ప్రత్యేక బస్సులు..తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం
దసరా పండుగకు 7 వేల ప్రత్యేక బస్సులు..తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం