రేపు ఎలా ఉందనున్నదో తెలుసుకోవాలనే ఆసక్తి ప్రతి ఒక్కరికీ ఉంటుంది. భవిష్యత్ గురించి తెలుసుకోవాలని ప్రతి ఒక్కరూ ఆసక్తిని చూపిస్తారు. అయితే వ్యక్తిగత భవిష్యత్ మాత్రమే కాదు.. ప్రపంచంలో రానున్న రోజుల్లో ఎలా ఉండనున్నాయి.. ఏ విధంగా గడుస్తాయి.. మంచ్చి చెడుల గురించి ఆలోచిస్తారు.. ఈ నేపథ్యంలో ఎక్కడ ఏ విషయం జరిగినా వెంటనే వీరబ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారనో.. లేదా బాబా వంగా చెప్పారనో గుర్తు చేస్తుకుంటారు. అయితే తాజాగా ఇప్పుడు మరో 19 ఏళ్ల యువతి భవిష్య వాణిని వినిపిస్తోంది. అవును ఈ యువతి అంచనా వేసినవి 2022 లో ఇప్పటి వరకూ 11 ప్రధాన సంఘటనక్లూ నిజమయ్యాయి. దీంతో ఈ 19 ఏళ్ల యువతి హన్నా కారోల్ బల్గేరియన్ మానసిక బాబా వంగాతో పోలుస్తున్నారు. అటు బాబా వంగా తో పాటు ఇటు హన్నా కారోల్ రాణి మరణాన్ని సరిగ్గా అంచనా వేశారు.
హన్నా కారోల్.. జనవరిలో 2022 కోసం 28 అంచనాలను వ్రాసింది. హ్యారీ స్టైల్స్ , బెయోన్స్ నుండి కొత్త ఆల్బమ్‌లు, రిహన్న గర్భవతి కావడం.. ప్రియాంక చోప్రా నిక్ జోనాస్ దంపతులు బిడ్డను స్వాగతించడంతో సహా ఇప్పటి వరకూ 11 అంచనాలు నిజమయ్యాయి. అంతేకాదు కిమ్ కర్దాషియాన్ పీట్ డేవిడ్సన్ విడిపోవడాన్ని కూడా హన్నా సరిగ్గా అంచనా వేసింది.అయితే ఇప్పుడు కోర్ట్నీ కర్దాషియాన్ గర్భవతి అవుతుందని ఆమె వేసిన అంచనా నిజమవుతుందని అందరూ భావిస్తున్నారు.
హన్నా ఇతర అంచనాల్లో కెండల్ జెన్నర్ నిశ్చితార్థం, హేలీ బీబర్ గర్భవతి కావడం వంటివి ఉన్నాయి. ఆమె వన్ డైరెక్షన్ రీయూనియన్‌ని కూడా అంచనా వేసింది.. టేలర్ స్విఫ్ట్ తనకు నిశ్చితార్థం లేదా వివాహం చేసుకున్నట్లు ప్రకటించింది. బిల్లీ ఎలిష్ తాను ద్విలింగ సంపర్కురాలని వెల్లడించింది. “తన అంచనాలన్నీ నిజమవుతాయని తాను ఇప్పటికీ అనుకుంటున్నానని .. అయితే సమయపాలనలో కొంచెం దూరంగా ఉన్నానని చెబుతోంది హన్నా కారోల్. అంతేకాదు తాను చెప్పిన మరికొన్ని అంచనాలు ఈ సంవత్సరం కాకుండా రాబోయే కొన్ని సంవత్సరాల్లో జరుగుతాయని పేర్కొంది.
నిక్ జోనాస్, ప్రియాంక చోప్రాలకు బిడ్డ పుట్టడంతో తాను చెప్పిన అంచనా మొదటిది నిజం అయిందని హన్నా ప్రకటించడంతో అప్పటి నుంచి ఆమె గురించి సెర్చ్ చేయడం మొదలు పెట్టాయారు. అంతేకాదు తమ వ్యక్తి గత భవిష్యత్ ను గురించి కూడా చెప్పమంటూ అనేక మంది వ్యక్తిగతంగా మెసేజ్ లు చేయడం ప్రారంభించారు. దీంతో హన్నా వ్యక్తిగత జీవితంలో రానున్న సంఘటనలను చెప్పడం మొదలు పెట్టింది. ప్రేమ, భవిష్యత్, విద్య, ఉద్యోగం, గర్భం, సంతానం ఇలా ఏ విషయాన్నీ అయినా తగిన చార్జీలు తీసుకుని చెబుతోంది.
ప్రేమ లేదా కెరీర్ చెప్పాలంటే £12 (రూ. 1,100)లను వసూలు చేస్తుండగా.. గర్భం, సంతానోత్పత్తి వంటి సమస్యలకు£16 (రూ. 1,400) లు వసూలు చేస్తోంది. ఇక సాధారణ జీవితం లో జరిగే విశేషాలను చెప్పడానికి £20 (రూ. 1,800)కి అందిస్తుంది. ఇలా వారంలో దాదాపు 30 మందికి భవిష్యత్ ను చెబుతోంది. దాదాపు £1,475 (రూ. 1.36 లక్షలు) సంపాదిస్తోంది. ఆమె అంచనాలు నిజమైతే.. ఆ క్లయింట్లు ఆమె వద్దకు మళ్ళీ మళ్ళీ వెళ్తున్నారు. ఇదే విషయంపై హన్నా మాట్లాడుతూ, “వ్యక్తిగతంగా భవిష్యత్ గురించి తాను చెప్పిన అనేక అంచనాలు నిజమయ్యాయి.. ఇదే విషయాన్నీ తన వద్దకు వచ్చిన వారు చెబుతోంటే తనకు మరింత బాగుంటుందని పేర్కొంది.
అంతేకాదు తాను “ఎప్పుడు గర్భవతి అవుతారో లేదా కొత్త కెరీర్‌ను ఎప్పుడు ప్రారంభించాలో లేదా మీ జీవిత భాగస్వామిని ఎప్పుడు కలుస్తారో ఇలా అన్ని విషయాలను చెప్పగలను అని పేర్కొంది. కొన్ని ఫోటోల తీసుకుని.. అప్పుడు తాను తన మంచం మీద కూర్చుని వాటిని చూస్తూ అంతర్ దృష్టికి ట్యూన్ చేయడానికి ప్రయత్నిస్తాననని.. అప్పుడు వారి భవిష్యత్ తన దృష్టికి గోచరిస్తుందని చెబుతోంది హన్నా..
తాను ఎంత బిజీగా ఉన్నా.. సాధారణంగా ప్రతి రెండు, మూడు రోజులకు 15 రీడింగ్‌లు చేస్తానని తెలిపింది. అయితే తాను ఇలా భవిష్యత్ ను చెప్పడాన్ని కెరీర్‌గా ఎంచుకోవాలని ఎప్పుడూ అనుకోలేదని స్పష్టం చేస్తోంది. ఈ ఏడాదిలో తాను చెప్పిన అంచనాలు నిజం అవుతాయని.. ప్రజలు వాటిని చూస్తారని ఎప్పుడూ అనుకోలేదని తెలిపింది. ఖచ్చితంగా తన అంతర్ దృష్టిని ఇప్పుడు మరింత ఎక్కువగా విశ్వసిస్తున్నానని తాను ఊహించినవి మరిన్ని నిజం అవుతాయని.. ఏవి ఎప్పుడు అవుతాయా అంటూ ఎదురు చూస్తున్నానని పేర్కొంది హన్నా కారోల్.
మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..