Rhys Langford: కొంత మంది మరణించి చిరంజీవులు. క్యాన్సర్ (Cancer) తో ప్రాణాల కోసం తాను పడుతున్న బాధను పక్కకు పెట్టి.. తనలా క్యానర్ బారిన పడి ప్రాణాల కోసం పోరాడుతున్న చిన్నారి ప్రాణాలను నిలబెట్టడం కోసం చేసిన ప్రయత్నం ప్రతి ఒక్కరి హృదయాలను హత్తుకుంది. సాధారణంగా బాధల్లో ఉన్నవారికి తమ బాధలు తప్ప అవతలివారికి సాయం చేయాలనే ఆలోచన రాదు. అయితే ఇక్కడ ఒక వ్యక్తి ప్రమాదకరమైన క్యాన్సర్‌తో పోరాడుతూ తనలా బాధపడుతున్న మరో పేషంట్‌ను కాపాడాలనుకున్నాడు. అమెరికా(America)కు చెందిన రైస్ లాంగ్‌ఫోర్డ్ అనే యువకుడు ప్రతిభావంతుడైన అథ్లెట్(athlete). అతను ఒక రోజు తన స్నేహితులతో కలసి చేసిన స్ప్రింట్ రేస్‌లో కళ్లు తిరిగి పడిపోయాడు. అప్పుడే రైస్ ఆస్టియోసార్కోమా అనే క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నట్లు తెలిసింది. అతని కుడి కాలు తుంటిలో కంతిని గుర్తించిన వైద్యులు తొలగించే నిమిత్తం మొత్తం కాలుని తీసేశారు. దీంతో రైస్ జీవితాంతం కర్రల సాయంతోనే నడిచే పరిస్థితి ఎదురైంది.
అయితే అతని కుటుంబసభ్యులు మాత్రం రైస్ క్యాన్సర్‌ని జయించి బయటపడ్డాడని ఆనందించారు. కానీ ఆ ఆనందం ఎంతోసేపు నిలువలేదు. రైస్‌కి శస్త్రచికిత్స జరిగిన కాలు మళ్లీ వాపు రావడం మొదలైంది. మళ్లీ క్యాన్సర్ తిరగబెట్టిందని గ్రహించాడు. ఈ క్రమంలో రైస్ తనలాగే మరో ఆరేళ్ల కుర్రవాడు క్యాన్సర్‌తో బాధపడుతున్నాడని తెలుసుకుని ఆ బాలుడికి సాయం చేయాలని నిర్ణయించుకున్నాడు. అందుకు రైస్ వ్యక్తిగతంగా సుమారు ఒక లక్ష రూపాయలు పొదుపు చేసి ఆ బాలుడి కుటుంబసభ్యులకు అందజేశాడు. అంతేకాకుండా ఆన్‌లైన్‌లో క్రౌడ్ ఫండింగ్ ఓపెన్‌చేసి ఆ బాలుడి కోసం దాదాపు 61 లక్షలు సేకరించాడు. ఆ మొత్తాన్ని జాకబ్ కుటుంబ సభ్యులకు అందించి, అతను మరణించాడు. దీంతో జాకబ్ కుటుంబ సభ్యలు “రైస్ తానున్న పరిస్థితిని పక్కనపెట్టి తమ బిడ్డ పట్ల అతను కనబర్చిన ప్రేమ, తెగువ, ధైర్యం నమశక్యంకానివని, రైస్ కారణంగానే తమ బిడ్డ క్యాన్సర్‌తో పోరాడి కొత్త జీవితాన్ని పొందే అవకాశం కలిగిందంటూ కన్నీటిపర్యంతమయ్యారు. ప్రస్తుతం ఈ విషయం ఆన్‌లైన్‌లో తెగ వైరల్ అవుతోంది. రైస్ ఆలోచనను నెటిజన్లు ప్రశంసిస్తూ అతని ఆత్మకు శాంతి కలగాలని ప్రార్ధిస్తున్నారు.
Also Read: