Viral Video: గుడ్డుపై నుంచి వెళ్లిన 16 టైర్ల భారీ ట్రక్.. అమేజింగ్ అంటూ నోరెళ్లబెడుతున్న నెటిజన్లు..
Truck passes from Egg: సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా.. మరికొన్ని ఆశ్చర్యకరంగా ఉంటాయి.
Truck passes from Egg: సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా.. మరికొన్ని ఆశ్చర్యకరంగా ఉంటాయి. సాధారణంగా స్టంట్స్ ఏవీ అంత సులువు కాదు. ఇందుకోసం కఠోర సాధన చేయాలి. కొందరికి విన్యాసాలు చేస్తున్నప్పుడు చాలా నమ్మకం కలుగుతుంది. వారు ఎటువంటి భయం లేకుండా ప్రమాదకరమైన ప్రదేశాలలో సులభంగా విన్యాసాలు చేయగలరు. అయితే ఈ రోజుల్లో వెలుగులోకి వచ్చిన వీడియో మాత్రం భారీ ట్రక్ డ్రైవర్‌కి సంబంధించినది. ట్రక్ టైర్ల మధ్య గుడ్డుతో స్టంట్ చేస్తాడు. సాధారణంగా గుడ్డు ఎంత సున్నితంగా ఉంటుందో మనందరికీ తెలుసు. కిందపడినా.. ఏవైనా వస్తువులు తగిలినా పగిలిపోతుంది. అలాంటి గుడ్డు మీద నుంచి ట్రక్ వెళుతుంది. అయితే ఆ గుడ్డుకు మాత్రం ఏం కాదు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట (social media) వైరల్ అవుతోంది.
ఈ వైరల్ వీడియో రోడ్డుపై గుడ్డు పెట్టడం చూడవచ్చు. ఆ తర్వాత 16 చక్రాల భారీ ట్రక్కు దాని మీదుగా వెళుతుంది. అయినప్పటికీ అది పగలదు. వాస్తవానికి ఈ గుడ్డు టైర్ల మధ్య ఉన్న చిన్న గ్యాప్ ప్రదేశంలో ఉంచుతారు. అయితే.. డ్రైవర్ ఆ గ్యాప్ మధ్య గుడ్డును ఉంచి.. దాని పైనుంచి తీసుకెళ్తాడు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా వీడియో చూడండి..
వైరల్ వీడియో..
View this post on Instagram
ఈ వీడియోను TechExpress అనే యూజర్ instagramలో షేర్ చేయగా.. వేలాది మంది మంది వీక్షించి లైకులు చేస్తున్నారు. దీంతోపాటు ఈ వీడియో అద్భుతంగా ఉందని.. సూపర్ డ్రైవర్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: