Viral Video: అతిథిగా వచ్చింది. పద్ధతిగా డోర్ ఓపెన్ చేసింది.. చివరకు ఊహించని ట్విస్ట్ ఇచ్చిన ఎలుగుబంటి..

గత కొద్ది రోజులుగా అడవిలో ఉండాల్సిన జంతువులు జన సమూహంలోకి వచ్చేస్తున్నాయి. ఇదివరకు జింకలు, నెమళ్లు, కోతులు గ్రామాల్లోకి వచ్చి హల్చల్ చేసేవి..

Viral Video: అతిథిగా వచ్చింది. పద్ధతిగా డోర్ ఓపెన్ చేసింది.. చివరకు ఊహించని ట్విస్ట్ ఇచ్చిన ఎలుగుబంటి..
Viral Video
Follow us
Rajitha Chanti

|

Updated on: Apr 28, 2022 | 1:29 PM

గత కొద్ది రోజులుగా అడవిలో ఉండాల్సిన జంతువులు జన సమూహంలోకి వచ్చేస్తున్నాయి. ఇదివరకు జింకలు, నెమళ్లు, కోతులు గ్రామాల్లోకి వచ్చి హల్చల్ చేసేవి.. కానీ ప్రస్తుతం పులులు, సింహాలు, ఏనుగులు ఇలా ఒక్కటేమిటీ అడవిలో ఉండాల్సిన జంతువులు గ్రామాలు, పట్టాణాల్లోకి ప్రవేశిస్తున్నాయి. అడవులు తగ్గిపోవడం..ఆకలితో దారితప్పి ఊర్లలో ఇళ్లలోకి చొరబడుతున్నాయి. ఇటీవల ఇలా జంతువులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. పులులు, సింహాలు, ఎలుగు బంట్లు వంటి జంతువులు ఇళ్లలోకి ప్రవేశించి నానా హంగామా చేస్తున్న ఘటనలకు సంబంధించిన వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. అందులో కొన్నిసార్లు జంతువులు చేసే పనులు నవ్వులు పూయించిన మరికొన్నిసార్లు భయాందోళనలు కలిగిస్తాయి. తాజాగా ఓ ఎలుగు బంటి అథిగా వచ్చి ఏకంగా ఇంటి డోర్ ఓపెన్ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది..

న్యూయార్క్ స్టేట్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎన్విరాన్‌మెంటల్ కన్జర్వేషన్ ఫేస్‌బుక్‌లో షేర్ చేసిన ఓ సీసీ టీవీ ఫుటేజ్‏లో ఓ ఎలుగు బంటి ఎంతో నెమ్మదిగా ఇంటి బాల్కానీలోకి ప్రవేశించింది. అక్కడి నుంచి మెల్లగా నడుస్తూ.. ఇంటి మెయిన్ డోర్ వద్దకు చేరింది. ఆ తర్వాత స్టెప్స్ ఎక్కి.. దిక్కులు చూస్తూనే ఇంటి తలుపును ఓపెన్ చేసింది.. తలుపు పూర్తిగా తీసి.. ఇంట్లోకి చూసింది.. ఆ తర్వాత తిరిగి వెళ్లిపోయింది. ఈఘటన మొత్తం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. ఈ వీడియో నెటిజన్స్ పలు రకాలుగా స్పందిస్తున్నారు. ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో ఎలుగుబంట్లు ఇలా ఇళ్లలోకి ప్రవేశిస్తున్నాయని.. అధికారులు ఓపెన్ ట్రాష్ కంటైనర్లు వంటి ఆహార వనరులను అడవులలో సమకూర్చాలని కోరుతున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Also Read: Viral Photo: అమాయకపు చూపులతో ముద్దులొలుకుతున్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టండి.. టాలీవుడ్‏లోనే క్రేజీ హీరోయిన్..

Kaathu Vaakula Rendu Kadhal Twitter Review: కాతువాకుల రెండు కాదల్ సినిమా ట్విట్టర్ రివ్యూ.. సమంత హిట్ కొట్టేనా ?

KGF 2 Yash: కేజీఎఫ్ 3 గురించి ఆసక్తికర విషయాలు చెప్పిన రాఖీభాయ్.. సెకండ్ పార్ట్‏కు మించి ఉంటుందని..

Pawan Kalyan: భవదీయుడు భగత్ సింగ్ డైలాగ్ లీక్ చేసిన డైరెక్టర్.. పవర్ ఫుల్‏గా ఉందంటూ మెగాస్టార్ కితాబు..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!