Viral: ప్రకృతి తన్మయత్వంలో పర్యాటకులు.. ఒక్కసారిగా కొట్టుకొచ్చిన వరద.. అంతే అంతా అయిపోయింది

మధ్యప్రదేశ్ (Madhya Pradesh) లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. సూక్డీ నది ప్రవాహం ఒక్కసారిగా పెరగడంతో ఏకంగా 14 కార్లు కొట్టుకుపోయాయి. ఖర్గోన్‌ ప్రాంతంలోని కట్కూరు అటవీ ప్రాంతాన్ని వీక్షించేందుకు వివిధ ప్రాంతాల...

Viral: ప్రకృతి తన్మయత్వంలో పర్యాటకులు.. ఒక్కసారిగా కొట్టుకొచ్చిన వరద.. అంతే అంతా అయిపోయింది
Car Wash Away In Flood
Follow us
Ganesh Mudavath

|

Updated on: Aug 08, 2022 | 6:56 PM

మధ్యప్రదేశ్ (Madhya Pradesh) లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. సూక్డీ నది ప్రవాహం ఒక్కసారిగా పెరగడంతో ఏకంగా 14 కార్లు కొట్టుకుపోయాయి. ఖర్గోన్‌ ప్రాంతంలోని కట్కూరు అటవీ ప్రాంతాన్ని వీక్షించేందుకు వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు వస్తుంటారు. ఇండోర్‌ జిల్లాకు చెందిన దాదాపు 50 మంది పర్యాటకులు అటవీ ప్రాంతానికి వచ్చారు. ప్రకృతి అందాలను చూస్తున్న సమయంలో సుక్డీ నది (Sukdi River) కి భారీగా వరద వచ్చింది. దీంతో భయాందోళనకు గురైన పర్యాటకులు ప్రాణభయంతో పరుగులు తీశారు. వీరిలో చిన్నారులు, మహిళలు ఉన్నారు. వీరు తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నప్పటికీ.. వారి 14 కార్లు వరదలో కొట్టుకుపోయాయి. వీటిలో ఖరీదైన ఎస్‌యూవీ కార్లు కూడా ఉన్నాయి. వెంటనే విషయాన్ని పోలీసులకు తెలిపారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు నది ఉద్ధృతిని పరిశీలించారు. కొట్టుకుపోయిన కార్ల ఆచూకీ తెలుసుకునేందుకు గ్రామస్థుల సహాయంతో సహాయక చర్యలు చేపట్టారు. వాటిల్లో కొన్ని కార్లను గుర్తించామని, బయటకు తీస్తున్నామని ఏఎస్‌పీ జితేంద్రసింగ్‌ పవార్‌ వెల్లడించారు. కాగా.. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

స్థానిక గ్రామస్థుల ట్రాక్టర్ల సహాయంతో 10 కార్లు, ఎస్‌యూవీలను బయటకు తీశారు. మరో మూడు కార్లు సుదూర ప్రాంతాలకు కొట్టుకుపోయాయని, ఒకటి వంతెన దగ్గర ఇరుక్కుపోయిందని తెలిపారు. ఈ ప్రాంతంలో ఆకస్మిక వరదల కారణంగా సంభవించే ప్రమాదం గురించి ప్రజలను హెచ్చరించడానికి బోర్డులు ఉంచినట్లు అధికారులు తెలిపారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.