Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ramateertham Issue: కొనసాగుతోన్న రామతీర్థం టెన్షన్..పోలీసుల అదుపులో 20 మంది అనుమానితులు..రేపు జనసేనాని రాక

రామతీర్థం విగ్రహ ధ్వంస ఘటన ఏపీలో పొలిటికల్ హీట్ పెంచుతుంది. రామతీర్థం కాస్త రాజకీయ రణక్షేత్రంగా మారింది. ఇప్పటికే అధికార, ప్రతిపక్షాల అగ్ర నాయకుల...

Ramateertham Issue: కొనసాగుతోన్న రామతీర్థం టెన్షన్..పోలీసుల అదుపులో 20 మంది అనుమానితులు..రేపు జనసేనాని రాక
Follow us
Ram Naramaneni

|

Updated on: Jan 04, 2021 | 7:55 AM

Ramateertham Issue:  రామతీర్థం విగ్రహ ధ్వంస ఘటన ఏపీలో పొలిటికల్ హీట్ పెంచుతుంది. రామతీర్థం కాస్త రాజకీయ రణక్షేత్రంగా మారింది. ఇప్పటికే అధికార, ప్రతిపక్షాల అగ్ర నాయకుల రాకతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. మరోవైపు కేసు దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు.  ఇరవై మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి రామతీర్థం వచ్చినప్పుడు  రాళ్లు విసిరిన ఘటనలో ముగ్గురు టిడిపి కార్యకర్తలను అరెస్ట్ చేశారు. రామతీర్థం కొండ వద్ద పోలీసుల బందోబస్తు కొనసాగుతుంది.

జనవరి 5న  జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు రామతీర్థం రానున్నారు. శ్రీ కొందడరామ స్వామి విగ్రహ శిరస్సును నరికివేసిన ఘటనలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా జనసేన-బీజేపీలు సంయుక్త కార్యక్రమం నిర్వహించనున్నాయి. మరోవైపు తాజాగా రామతీర్థంలో పర్యటించిన ఏపీ మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్, బొత్స సత్యనారాయణ ఘటనకు ప్రతిపక్ష నేత చంద్రబాబే కారణమని ఆరోపిస్తున్నారు. రామతీర్థం చూట్టూ రగిలిన పొలిటికల్ వార్ ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు.

Also Read :

Bird Flu Alert: రాష్ట్రాలకు కేంద్రం హై అలర్ట్.. బ‌ర్డ్ ఫ్లూ మనుషులకూ వ్యాప్తి చెందే అవకాశం..పలు ఆదేశాలు జారీ

LIC Jeevan Shanti: ఎల్‌ఐసీలో అదిరే పాలసీ.. ఒక్కసారి డబ్బులు కడితే ప్రతి నెలా వేలల్లో పింఛన్ !

LPG Gas Cylinders: గ్యాస్ సిలిండర్ డెలివరీ బాయ్‌కి ఒక్క రూపాయి ఇవ్వక్కర్లేదు..తేల్చి చెప్పిన హెచ్‌పీసీఎల్