శాంసన్ ఊచకోతపై మాజీల ప్రశంసలు
ఐపీఎల్ తాజా సీజన్ లో భాగంగా సీఎస్‌కే తో మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ ప్లేయర్ సంజూ శాంసన్ దుమ్మురేపాడు. సీఎస్‌కే బౌలర్లకు చుక్కలు చూపించాడు.

ఐపీఎల్ తాజా సీజన్ లో భాగంగా సీఎస్‌కే తో మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ ప్లేయర్ సంజూ శాంసన్ దుమ్మురేపాడు. సీఎస్‌కే బౌలర్లకు చుక్కలు చూపించాడు. యశస్వి జైస్వాల్(6) నిష్క్రమించడంతో మైదానంలోకి అడుగుపెట్టిన సంజూ శాంసన్..రావడంతోనే విధ్వంసకర షాట్లతో విరుచుకుపడ్డాడు. సిక్సర్ల సునామీతో 19 బంతుల్లో( 1 ఫోర్, 6 సిక్స్‌లు) హాఫ్ సెంచరీ చేశాడు. పీయూష్ చావ్లా, రవీంద్ర జడేజా లాంటి సీనియర్ బౌలర్లను ఒక ఆట ఆడుకున్నాడు. దీంతో అతడిపై మాజీ ఆటగాళ్లతో పాటు సీనియర్ల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగాసచిన్ టెండూల్కర్, గౌతమ్ గంభీర్ రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్ సంజూ శాంసన్ పై ప్రశంసలు కురిపించారు. ‘క్లీన్ స్ట్రైకింగ్. అవన్నీ సరైన క్రికెట్ షాట్లు’ అని సచిన్ పేర్కొన్నాడు. ‘సంజు శాంసన్ భారతదేశంలో ఉత్తమ వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్ మాత్రమే కాదు, భారతదేశంలో ఉత్తమ యువ బ్యాట్స్ మాన్. ఎవరైనా డిబేట్ కి వస్తారా’ అని గంభీర్ ట్వీట్ చేశారు.
Clean striking by @IamSanjuSamson. They were all proper cricketing shots and not slogs. Smartly bowled by @NgidiLungi. Short,wide and slow. #CSKvsRR
— Sachin Tendulkar (@sachin_rt) September 22, 2020
It’s weird that the only playing eleven Sanju Samson doesn’t find a place is that of India, rest almost everyone is ready for him with open arms @rajasthanroyals @IPL @BCCI
— Gautam Gambhir (@GautamGambhir) September 22, 2020
Sanju Samson is not just the best wicketkeeper batsmen in India but the best young batsman in India! Anyone up for debate?
— Gautam Gambhir (@GautamGambhir) September 22, 2020