Sharmila deeksha: ఖమ్మం జిల్లాలో వైఎస్‌ఆర్‌టీపీ ‘నిరుద్యోగ నిరాహార దీక్ష’.. నాగేశ్వరరావు కుటుంబ కష్టాలు విని కన్నీరు పెట్టుకున్న షర్మిల

|

Jul 20, 2021 | 2:32 PM

పెనుబల్లి మండలం గంగదేవిపాడులో ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగి నాగేశ్వరరావు కుటుంబాన్ని వైఎస్ షర్మిల పరామర్శించారు.

Sharmila deeksha: ఖమ్మం జిల్లాలో వైఎస్‌ఆర్‌టీపీ ‘నిరుద్యోగ నిరాహార దీక్ష’.. నాగేశ్వరరావు కుటుంబ కష్టాలు విని కన్నీరు పెట్టుకున్న షర్మిల
Sharmila Deeksha
Follow us on

YSRTP President Sharmila Nirudhyoga Niraharadeeksha: రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ వెంటనే చేపట్టాలని వైఎస్ఆర్‌ తెలంగాణ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరుద్యోగ దీక్ష ఇవాళ ఖమ్మం జిల్లాలో కొనసాగుతోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం, పెనుబల్లి ఎమ్మార్వో ఆఫీస్‌ వద్ద వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధినాయకురాలు వైఎస్‌ షర్మిల నిరాహారదీక్ష చేపట్టారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ‘నిరుద్యోగ నిరాహార దీక్ష’ కొనసాగనుంది. ఇటీవల ఆత్మహత్య పాల్పడిన గంగదేవిపాడుకు చెందిన నిరుద్యోగి నాగేశ్వరరావు కుటుంబాన్ని షర్మిల పరామర్శించారు.

పెనుబల్లి మండలం గంగదేవిపాడులో ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగి నాగేశ్వరరావు కుటుంబాన్ని వైఎస్ షర్మిల పరామర్శించారు. నాగేశ్వరరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. అనంతరం నాగేశ్వరరావు కుటుంబ సభ్యులను ఓదార్చారు. వాళ్ల కుటుంబం ఎదుర్కొంటున్న కష్టాలను అడిగి తెలుసుకున్న షర్మిల అన్ని రకాలుగా అండగా ఉంటామని భరోసా కల్పించారు. వాళ్ల కష్టాలు విన్న ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు.

అనంతరం పెనుబల్లిలో నిరుద్యోగ నిరాహార దీక్షకు దిగారు. ముందుగా వైఎస్‌ఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆ తర్వాత దీక్షలో కూర్చున్నారు. తెలంగాణలోని నిరుద్యోగ సమస్యలపై ప్రతి మంగళవారం నిరుద్యోగ దీక్ష చేపట్టాలనే నిర్ణయంలో భాగంగా షర్మిల నిరసనకు దిగారు.

Read Also…

Corona Effect on Theatres: త్రిశంకు స్వర్గంలో తెలుగు సినీ పరిశ్రమ.. థియేటర్లపై సినిమా కష్టాలు..!

రైతును కాలితో తన్ని, కూతుర్ని ఈడ్చుకెళ్లిన అధికారి..తీవ్ర కలకలం రేపుతున్న అధికారి వీడియో..:Rajasthan SDM Video.