YS Sharmila: ‘వైఎస్ఆర్‌ను కుట్ర చేసి చంపారు.. నన్ను కూడా చంపగలరు’.. వైఎస్ షర్మిల సంచలన కామెంట్స్..

|

Sep 18, 2022 | 11:56 AM

YS Sharmila: వైఎస్ఆర్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల సంచలన కామెంట్స్ చేశారు. వైఎస్ఆర్‌ను కుట్ర చేసి చంపారని షాకింగ్ ఆరోపణలు చేశారు. అంతేకాదు..

YS Sharmila: ‘వైఎస్ఆర్‌ను కుట్ర చేసి చంపారు.. నన్ను కూడా చంపగలరు’.. వైఎస్ షర్మిల సంచలన కామెంట్స్..
Sharmila
Follow us on

YS Sharmila: వైఎస్‌ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డిని కుట్ర చేసి చంపారని ఆరోపించారు. తనని కూడా చంపాలని చూస్తున్నారని అన్నారు. తాను పులిబిడ్డనని.. తనకు భయం లేదని చెప్పారు. కేసులు పెడితే భయం లేదని… దమ్ముంటే అరెస్టు చేయండి అంటూ షర్మిల్ సవాల్‌ విసిరారు.

వనపర్తి పాదయాత్ర ప్రెస్‌మీట్‌లో షర్మిల్‌ చేసిన ఈకామెంట్స్‌ పొలిటికల్‌ సర్కిల్స్‌లో హాట్‌ టాపిక్‌గా మారాయి. కుట్ర చేసి వైఎస్‌ చంపారని ఆమె ఆరోపించారు. తనని కూడా చంపాలని చూస్తున్నారని అన్నారు.

ఇంతకుముందు టీఆర్‌ఎస్‌ వర్సెస్‌ షర్మిల పొలిటికల్‌ ఫైట్‌ నడిచింది. వనపర్తి నియోజకవర్గంలో పాదయాత్ర ఎంటరైనా తర్వాత షర్మిల తనపై చేసిన వ్యాఖ్యలపై కౌంటర్‌ ఇచ్చారు మంత్రి నిరంజన్‌ రెడ్డి. షర్మిల తన మరదలు అంటూ చేసిన కామెంట్స్‌ కాంట్రావర్సీగా మారాయి. దీనిపై షర్మిల ఊడా గట్టిగానే సమాధానం ఇచ్చారు. దీంతో షర్మిల కామెంట్లపై చర్య తీసుకోవాలంటూ.. స్పీకర్ కు కంప్లయింట్ చేశారు టీఆర్ఎస్ లీడర్లు. శాసన సభ్యుల గౌరవాన్ని కించపరిచేలా.. షర్మిల వాఖ్యానించారని.. స్పీకర్, డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై మంత్రులు, ఎమ్మెల్యేలతో చర్చించి తగిన చర్య తీసుకుంటామని.. హామీ ఇచ్చారు స్పీకర్. షర్మిలపై మంత్రులిచ్చిన కంప్లయింట్ ను ప్రివిలేజ్ కమిటీకి పంపారు. అయితే సభా హక్కుల కమిటీకి ఫిర్యాదు చేసిన తాను తగ్గేదేలే అన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..