Telangana: భట్టి విక్రమార్క ఇంటి పూజ గదిలో వైఎస్సార్ ఫోటో

|

Dec 07, 2023 | 12:57 PM

మల్లు భట్టి విక్రమార్క.. 2023 తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో నాలుగవసారి బంపర్ మెజార్టీతో మధిర నియోజకవర్గం నుంచి గెలుపొందారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో.. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ప్రమాణ స్వీకారానికి వెళ్లేముందు ఇంట్లో పూజలు చేశారు భట్టి. ఆ సమయంలో పూజ గదిలో వైఎస్సార్ ఫోటో కూడా ఉండటం అందరి దృష్టిని ఆకర్షించింది.

Telangana: భట్టి విక్రమార్క ఇంటి పూజ గదిలో వైఎస్సార్ ఫోటో
Mallu Bhatti Vikramarka
Follow us on

మల్లు భట్టి విక్రమార్క.. 2023 తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో నాలుగవసారి బంపర్ మెజార్టీతో మధిర నియోజకవర్గం నుంచి గెలుపొందారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో.. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ప్రమాణ స్వీకారానికి వెళ్లేముందు ఇంట్లో పూజలు చేశారు భట్టి. ఆ సమయంలో పూజ గదిలో వైఎస్సార్ ఫోటో కూడా ఉండటం అందరి దృష్టిని ఆకర్షించింది. భట్టి.. మాజీ సీఎం, దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డిని విపరీతంగా అభిమానిస్తారు.. ఆరాధిస్తారు. భట్టి రాజకీయంగా ఎదిగేందుకు వైఎస్సార్ ఎంతగానో కృషి చేశారు. అంతకముందు ఎమ్మెల్సీగా పనిచేసిన భట్టికి 2009లో తొలిసారి కాంగ్రెస్ టికెట్ ఇచ్చారు వైఎస్సార్.  ఆ ఎన్నికల్లో గెలవడంతో భట్టిని 2009-11 మధ్య ఉమ్మడి ఏపీ చీఫ్‌ విప్‌‌గా నియమించారు. వైఎస్ మరణాంతరం 2011-2014 మధ్య ఉమ్మడి ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్‌‌గా విధులు నిర్వర్తించారు భట్టి విక్రమార్క.  ఇలా తొలిసారి గెలిచిన ఆయనకు విశేష పదవులు దక్కాయి. అందులో వైఎస్ పాత్ర ఎంతో ఉంది. అందుకే భట్టి.. వైఎస్సార్‌ను దైవంలా భావిస్తారు. ఆయన గురించి తలుచుకున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు ఎమోషనల్ అవుతారు.

కొత్త ప్రభుత్వంలో సీఎం పదవి ఆశించారు భట్టి. కానీ అధిష్టానం ఆయన డిప్యూటీ సీఎం పదవి ఇచ్చింది. సీఎం పోస్ట్ ఆశించిన మాట వాస్తవమే కానీ.. హైకమాండ్ నిర్ణయాన్ని గౌరవిస్తానన్నారు భట్టి. వివాద రహితుడిగా భట్టి పేరుంది. 2019 నుంచి సీఎల్పీ లీడర్‌గా పనిచేశారు.

ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని దిగువన వీక్షించండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…